గుజరాత్ లోని భుజ్ లో కె.కె. పటేల్ సూపర్ స్పేశలిటీ హాస్పిటల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో ఏప్రిల్ 15వ తేదీ న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ ఆసుపత్రి ని భుజ్ లో శ్రీ కచ్ఛీ లేవా పటేల్ సమాజ్ నిర్మించింది.
ఇది యావత్తు కచ్ఛ్ లో తొలి దానశీల సూపర్ స్పేశలిటీ హాస్పిటల్. దీనిలో మొత్తం 200 పడక లు ఉన్నాయి. ఇది రోగుల కు సూపర్ స్పెశాలిటీ సేవలను ఉదాహరణ కు ఇంటర్ వెన్శనల్ కార్డియోలజి (కేథ్ లేబ్), కార్డియోథొరేసిక్ సర్జరి, రేడియేశన్ ఆంకోలజి, మెడికల్ ఆంకోలజి, సర్జికల్ ఆంకోలజి, నెఫ్రోలజి, యూరోలజి, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరి, కీలు మార్పిడి, ఇంకా లెబారటరి, రేడియోలజి వగైరా ఇతర సహాయక సేవల ను అందిస్తుంది. ఈ ఆసుపత్రి ఆ ప్రాంత ప్రజల కు మెడికల్ సూపర్ స్పేశలిటీ చికిత్స సేవల ను తక్కువ ధరల కు ఇట్టే అందుబాటు లోకి తీసుకు వస్తుంది.