దేశం లో ఆదివాసి జన సంఖ్య సంక్షేమం కోసం తగిన చర్యల ను తీసుకోవడం లో ప్రధాన మంత్రి ఎప్పటికీ ముందు నిలుస్తున్నారు. దీనితో పాటు, దేశం యొక్క ఉన్నతి కి మరియు అభివృద్ధి కి ఆదివాసి సముదాయాలు అందిస్తున్న తోడ్పాటుకు తగిన సమ్మానాన్ని కూడా ప్రధాన మంత్రి కట్టబెట్టుతూ వస్తున్నారు. జాతీయ రంగ స్థలం పైన ఆదివాసి సంస్కృతి ని ప్రకటించే ప్రయాసల లో భాగం గా ‘‘ఆది మహోత్సవ్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు.
ఆదివాసి సంస్కృతి, శిల్పాలు, అన్నం- పానీయాదులు, వాణిజ్యం మరియు సాంప్రదాయక కళ యొక్క ఉత్సవాన్ని జరిపే కార్యక్రమమే ఆది మహోత్సవ్ అని చెప్పాలి. ఇది ఆదివాసి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్ మెంట్ ఫెడరేశన్ లిమిటెడ్ (టిఆర్ఐఎఫ్ఇడి) యొక్క వార్షిక కార్యక్రమాల లో ఒక కార్యక్రమం గా నిలుస్తున్నది. ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ మొదలు 27వ తేదీ వరకు దిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో నిర్వహించడం జరుగుతున్నది.
ఆదివాసుల సమృద్ధమైనటువంటి మరియు వైవిధ్యభరితం అయినటువంటి వారసత్వాన్ని ఈ కార్యక్రమం లో కళ్లకు కట్టడం జరుగుతుంది. దీనికోసం కార్య స్థలి లో 200 కు పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మహోత్సవ్ లో దాదాపు గా ఒక వేయి మంది ఆదివాసి చేతివృత్తుల కళాకారులు పాలుపంచుకోనున్నారు. 2023వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం’ గా జరుపుకొంటున్న సందర్భం లో, హస్తకళ లు, చేనేత లు, మట్టి తో పాత్రల ను తయారు చేసే కళ, ఆభరణాలు మొదలైన ఆకర్షణలు కూడా కొలువుదీరనున్నాయి. ఆదివాసి సముదాయాలు సాగు చేసిన ‘శ్రీ అన్నా’న్ని సైతం ఈ మహోత్సవ్ లో ప్రత్యేకం గా ప్రదర్శన కు ఉంచుతారు.