ఫ్రాన్స్ గణతంత్రం అధ్యక్షుడు మాన్య శ్రీ ఇమేనుయెల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
ఇద్దరు నేత లు అఫ్ గానిస్తాన్ లో ఇటీవలి పరిణామాల తో పాటు ప్రాంతీయ అంశాల ను గురించి కూడా చర్చించారు. ఈ సందర్భం లో, వారు ఉగ్రవాదం, మాదక పదార్థాలు, చట్టవిరుద్ధం గా ఆయుధాల తరలింపు, మానవుల అక్రమ చేరవేత లు వంటి విపరిణామాలు చోటు చేసుకోవచ్చంటూ ఆందోళన ను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మానవ హక్కుల కు, మహిళల హక్కుల కు, అల్పసంఖ్యాకుల హక్కుల కు పూచీ పడవలసిన అవసరం ఉంది అని కూడా అభిప్రాయపడ్డారు.
ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతూ ఉన్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని గురించి, అలాగే ఆ ప్రాంతం లో స్థిరత్వాన్ని, భద్రత ను ప్రోత్సహించడం లో భారతదేశం- ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రముఖ పాత్ర ను పోషిస్తూ ఉండటాన్ని వారు సమీక్షించారు.
ఇరు దేశాలు ప్రగాఢం గా పదిలపరచుకొంటూ ఉన్నటువంటి భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు స్ఫూర్తి కి అనుగుణం గా క్రమం తప్పక సన్నిహిత సంప్రదింపుల ను కొనసాగిస్తూ ఉండేందుకు నేత లు అంగీకారాన్ని వ్యక్తం చేశారు.