జి-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ హిరోషిమాలోని సమావేశ వేదిక వద్ద శనివారం గణతంత్ర ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మానుయేల్ మాక్రోన్ తో ద్వైపాక్షిక సమావేశం జరిపారు.
ఈ ఏడాది జూలై 14వ తేదీన జరుగనున్న బా స్టీల్ దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా ఆహ్వానించినందుకు అధ్యక్షుడు
మాక్రోన్ కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్ధిక క్షేత్రాలు, పౌర విమానయం, పునరుద్ధరణీయ ఇంధనాలు , సంస్కృతి, రక్షణ రంగానికి కావలసిన వాటిని సహా ఉత్పత్తి , తయారీ, దానితో పాటు పౌర అణు సహకారాన్ని సమీక్షించి , జరుగుతున్న ప్రగతిపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని కొత్త క్షేత్రాలకు విస్తరించాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
భారత్ జి20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు ఇచ్చినందుకు అధ్యక్షుడు మాక్రోన్ కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి ఇద్దరు నేతలు పరస్పరం అభిప్రాయాలు తెలియజేసుకున్నారు.
PM @narendramodi held a productive meeting with President @EmmanuelMacron of France. The leaders took stock of the entire gamut of India-France bilateral relations. pic.twitter.com/7DuZRlOnbB
— PMO India (@PMOIndia) May 20, 2023