ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు- అనగా, 2019 వ సంవత్సరం జనవరి 17వ తేదీ- మొదలుకొని మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ కాలం లో ఆయన గాంధీనగర్ ను, అహమదాబాద్ ను మరియు హజీరా ను సందర్శిస్తారు.
ఆయన రేపటి రోజున తన తొలి కార్యక్రమం లో భాగం గా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ శో ను గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ ఎగ్జిబిశన్ కమ్ కన్వెన్శన్ సెంటర్ లో ప్రారంభించనున్నారు. అక్కడ 25కి పైగా పారిశ్రామిక మరియు వ్యాపార రంగాలను ఒకో చోట ప్రదర్శించనున్నారు.
సాయంత్రం పూట, అహమదాబాద్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసర్చ్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది ఒక అత్యధునాతనమైన సూపర్ స్పెశాలిటీ పబ్లిక్ హాస్పిటల్. అహమదాబాద్ నగర పాలక సంస్థ దీనిని నిర్మించింది. ఇందులో ఎయర్ ఆంబ్యులాన్స్ సహా అన్ని సదుపాయాలు ఆధునికమైనవే. 78 మీటర్ల ఎత్తయిన ఈ నిర్మాణం నైపుణ్యం, పరిమాణం, ఇంకా వేగాల మేలు కలయిక గా ఉంది.
డిజిటల్ ఇండియా స్ఫూర్తి కి అనుగుణం గా ఇది అచ్చం గా కాగిత రహిత ఆసుపత్రి గా పని చేయనుంది. ఇది సామాన్య మానవుడి కి సేవలను అందించనుంది. అలాగే, ‘ఆయుష్మాన్ భారత్’ యొక్క దూరగామి దార్శనికత కు అండదండల ను అందించనుంది.
ఆసుపత్రి లోని సౌకర్యాల ను ప్రధాన మంత్రి పరిశీలించి, జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆ తరువాత అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్-2019ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఇది వైబ్రంట్ గుజరాత్ తో పాటు అదే సమయం లో జరుగనుంది. వైబ్రంట్ గుజరాత్ అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్ మాస్కట్ ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్-2019 వంటి కార్యక్రమాన్ని భారతదేశం లో నిర్వహించటం ఇదే మొదటి సారి. నగరాని కి చెందిన సంస్థ లకు వాటి ఉత్పత్తుల ను ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని ఇది ఇవ్వనుంది.
ఈ సందర్భం గా జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
మరుసటి రోజు న- అంటే 2019 వ సంవత్సరం జనవరి 18వ తేదీ నాడు- గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్శన్ సెంటర్ లో వైబ్రంట్ గుజరాత్ సమిట్ తాలూకు 9వ సంచిక ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇది వరకు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో గుజరాత్ ను పెట్టుబడి గమ్యస్థానం గా అనేక సంస్థలు ఎంచుకోవడానికి వీలు గా వైబ్రంట్ గుజరాత్ సమిట్ కు 2003 సంవత్సరం లో రూపకల్పన చేశారు. ఈ శిఖర సమ్మేళనం ప్రపంచం లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం తో పాటు ప్రభావశీల భాగస్వామ్యాల ను ఏర్పచుకోవడం తదితర అంశాల పై మేధోమథనాని కి ఒక వేదిక ను సమకూర్చుతోంది.
ప్రధాన మంత్రి 2019 వ సంవత్సరం జనవరి 19వ తేదీ నాడు హజీరా గన్ ఫ్యాక్టరీ స్థాపన కు గుర్తు గా హజీరా ను సందర్శించనున్నారు.
హజీరా నుండి ఆయన దాద్ రా నగర్ హవేలీ లోని సిల్‌వాసా కు వెళ్తారు. వివిధ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు; మరిన్ని అభివృద్ధి పథకాల కు కూడా శంకుస్థాపన చేస్తారు.
ప్రధాన మంత్రి తన పర్యటన చివరి చరణం లో జనవరి 19వ తేదీ నాడు ముంబయి కి వెళ్ళనున్నారు. నేశనల్ మ్యూజియమ్ ఆఫ్ ఇండియన్ సినిమా యొక్క నూతన భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.