దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన’ (పిఎమ్ బిజెపి) మరియు తక్కు ఖర్చులో పూర్తి అయ్యే కార్డియేక్ స్టెంట్ లు, ఇంకా మోకాలి శస్త్రచికిత్సల యొక్క లబ్ధిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 7 వ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా చర్చించనున్నారు.
ఈ కార్యక్రమాలు రోగుల జీవితాలలో, ప్రత్యేకించి పేదల జీవితాలలో, ఏ విధమైనటువంటి మార్పులను తీసుకువచ్చిందీ తెలుసుకోవడంతో పాటు వారి ప్రతిస్పందనను స్వయంగా గ్రహించాలన్నది కూడా ఈ చర్చ యొక్క ఉద్దేశంగా ఉంది.
ఈ చర్చ అంతా కూడా నమో యాప్ (NAMO App), యూట్యూబ్, ఫేస్ బుక్ తదితర వేరు వేరు సామాజిక మాధ్యమాలు వేదికలుగా సాగనుంది.