దేశం లో మొట్టమొదటిసారి గా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ న భువనేశ్వర్ లో జరుగనుండగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ ఆట ల యొక్క ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగించనున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ ఆటల ను శ్రీ మోదీ ప్రారంభిస్తారు.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తో కలసి భారత ప్రభుత్వం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ప్రారంభించనుంది.
ఖేలో ఇండియా ప్రోగ్రాము ప్రధాన మంత్రి ఆలోచనల లో నుండి జనించింది. భారతదేశం లో ఆడేటటువంటి అన్ని ఆటల కు సంబంధించి ఒక బలమైన ఫ్రేమ్ వర్క్ ను నిర్మించడం ద్వారా క్రీడాసంస్కృతి ని అట్టడుగు స్థాయి నుండి పునరుద్ధరించడం కోసం మరియు భారతదేశాన్ని ఒక ఘనమైనటువంటి క్రీడ ల దేశం గా ప్రతిష్టించడం కోసం దీనిని ప్రవేశపెట్టడమైంది.
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను భువనేశ్వర్ లో 2020వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ నాటి నుండి మార్చి నెల ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నారు.
భారతదేశం లో విశ్వవిద్యాలయాల స్థాయి లో నిర్వహించే అతి పెద్దదైన పోటీ ఇది. దీని లో దేశవ్యాప్తం గా 150కి పైగా విశ్వవిద్యాలయాల కు చెందిన దాదాపు గా 3500 మంది క్రీడాకారులు పాల్గొంటారు.
ఈ ఆటల లో.. విలువిద్య, అథ్లెటిక్స్, కుస్తీ, ఫెన్సింగ్, జూడో, ఈత, వెయిట్ లిఫ్టింగ్, మల్లయుద్ధం, బ్యాడ్ మింటన్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, టేబల్ టెనిస్, టెనిస్, వాలీబాల్, రగ్బి, ఇంకా కబడ్డీ.. ఇలా మొత్తం 17 ఆట లు ఉంటాయి.