ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 11వ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ కు హాజరు అయ్యేందుకు 2019వ సంవత్సరం నవంబర్ 13వ మరియు 14వ తేదీల లో బ్రెజిల్ లోని బ్రెసీలియా కు వెళ్లనున్నారు. ‘‘అన్ని వర్గాల ను కలుపుకుపోయే భవిష్యత్తు కోసం ఆర్థిక వృద్ధి సాధన’’ అనేది ఈ సంవత్సరం బ్రిక్స్ సమిట్ ప్రధాన ఇతివృత్తం గా ఉంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ సమిట్ లో పాలుపంచుకోవడం ఇది ఆరో సారి కానుంది. 2014వ సంవత్సరం బ్రెజిల్ లోని ఫోర్టాలెజా లో జరిగిన బ్రిక్స్ సమిట్ లో ఆయన తొలి సారి గా పాల్గొన్నారు.
ఆయన యాత్ర కాలం లో విశేషించి బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లో పాలు పంచకోవడం కోసం భారతదేశం నుండి పెద్ద సంఖ్య లో వ్యాపార రంగ ప్రతినిధిబృందం కూడాను అక్కడ కు చేరుకొంటుందన్న ఆశ ఉంది. ఆ ఫోరమ్ లో మొత్తం అయిదు సభ్యత్వ దేశాల కు చెందిన వ్యాపార సముదాయాని కి ప్రాతినిధ్యం ఉంటుంది.
ప్రధాన మంత్రి పదకొండో బ్రిక్స్ సమిట్ యొక్క ముగింపు మరియు సర్వ సభ్య సదస్సు లోను, బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ యొక్క ముగింపోత్సవం లోను పాలుపంచుకోవడం తో పాటు చైనా ప్రధాని శ్రీ శీ జిన్ పింగ్ తో మరియు రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో వేరు వేరు గా జరిగే ద్వైపాక్షిక సమావేశాల లో కూడా పాల్గొంటారు.
బ్రిక్స్ ముగింపు సమావేశం లో చర్చ లు సమకాలీన ప్రపంచం లో జాతీయ సార్వభౌమత్వ ప్రయోగం కోసం అవకాశాలు మరియు సవాళ్ళు అనే అంశం పై కేంద్రితం అయ్యేందుకు ఆస్కారం ఉంది. తదనంతరం బ్రిక్స్ సర్వ సభ్య సదస్సు ను నిర్వహిస్తారు. దీని లో నేత లు బ్రిక్స్ సమాజ ఆర్థికాభివృద్ధి కోసం అంతర్ బ్రిక్స్ సహకారం అంశం పై చర్చించనున్నారు.
ఆ తరువాత ప్రధాన మంత్రి బ్రిక్స్ నేతల తో, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ తో సమావేశం లో పాలు పంచుకొంటారు. ఈ సందర్భం గా బ్రెజిల్ కు చెందిన బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ యొక్క చైర్‌మన్ మరియు డెవెలప్ మెంట్ బ్యాంకు యొక్క ప్రెసిడెంట్ నివేదికల ను సమర్పించే అవకాశం ఉంది.
ఆ వెను వెంటనే, వ్యాపారం మరియు పెట్టుబడి ప్రోత్సాహక సంస్థల కు మధ్య ఒక బ్రిక్స్ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పైన సంతకాలు జరుగనున్నాయి.
శిఖర సమ్మేళనం సమాప్తి సందర్భం లో నేత లు ఒక సంయుక్త ప్రకటన పత్రాన్ని జారీ చేస్తారు.
ప్రపంచంలోని జనాభా లో 42 శాతం జనాభా నివసిస్తున్న, ప్రపంచ జిడిపి లో 23 శాతం జిడిపి తో పాటు ప్రపంచ వ్యాపారం లో సుమారు 17 శాతం వాటా ను కూడా కలిగిన అటువంటి అయిదు పెద్ద ఉదయిస్తున్న ఆర్థిక వ్యవస్థల ను బ్రిక్స్ ఒక కూటమి గా కలుపుతున్నది.
బ్రిక్స్ సహకారం లో రెండు స్తంభాలు ఉన్నాయి. వాటి లో నేత లు మరియు మంత్రుల భేటీ ల ద్వారా పరస్పర హితం ముడిపడిన అంశాల పై సంప్రదింపులు ఒకటో స్తంభం గా ఉండగా, వ్యాపారం, విత్తం, ఆరోగ్యం, విద్య, విజ్ఞానం మరియు సాంకేతికత, వ్యవసాయం, కమ్యూనికేశన్స్, ఐటి తదితర అనేక రంగాల లో సీనియర్ అధికారుల యొక్క సమావేశాల మాధ్యమం ద్వారా సహకారం అనేది రెండో స్తంభం గా ఉంది.