యువ భారతదేశం సమస్యల ను సాగదీసేందుకు సుముఖం గా లేదని, ఉగ్రవాదం తో మరియు వేర్పాటువాదం తో పోరాటం సలపడానికి అది సుముఖం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ లో ఈ రోజు న జరిగిన ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఒక యవ్వనభరితమైనటువంటి ఆలోచన సరళి ని మరియు అభిరుచి ని అలవరచుకోవలసిందని దేశ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు. జమ్ము– కశ్మీర్ సమస్య దశాబ్దాల తరబడి ఉంటూ వచ్చిందని ఆయన అన్నారు.
“దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్నప్పటి నుండి జమ్ము– కశ్మీర్ సమస్య ఉంటూ వస్తోంది. ఈ సమస్య ను పరిష్కరించడం కోసం ఏమి చేశారు?’’ అని ఆయన అన్నారు.
‘‘మూడు, నాలుగు కుటుంబాలు మరియు రాజకీయ పక్షాలు సమస్య కు పరిష్కారాన్ని అన్వేషించడం లో మాత్రమే ఆసక్తి ని చూపడంతో పాటు ఈ సమస్య ను పరిష్కరించకుండా ఉంచడం లో కూడాను ఆసక్తి ని ప్రదర్శించాయి’’ అని ఆయన అన్నారు.
‘‘దీని ఫలితం గా కశ్మీర్ లో ఉగ్రవాదం కొనసాగుతూ, వేల మంది అమాయకులు హతమయ్యారు; కశ్మీర్ నాశనం అయింది’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘రాష్ట్రం లోని లక్షల మంది ప్రజల ను వారి ఇళ్ళ లో నుండి వెళ్లగొడుతుంటే ప్రభుత్వం ఒక మౌన ప్రేక్షకురాలి వలె నిలబడివుండవలసిన పరిస్థితి’’ అని ఆయన అన్నారు.
370వ అధికరణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది ఒక తాత్కాలిక ఏర్పాటు అని భావించారు. కానీ, అది కొన్ని రాజకీయ పక్షాల వోటు బ్యాంకు రాజకీయాల వల్ల ఏడు దశాబ్దుల పాటు సాగింది అని పేర్కొన్నారు.
‘‘కశ్మీర్ ఈ దేశాని కి కిరీటం గా ఉంది. కశ్మీర్ ను దాని యొక్క గందరగోళం నుండి బయటకు తీసుకొని రావడం మన బాధ్యత’’ అని ఆయన అన్నారు.
జమ్ము– కశ్మీర్ లో దీర్ఘకాలం గా ఉంటూ వచ్చిన సమస్య ను పరిష్కరించడం అనేది 370వ అధికరణం రద్దు యొక్క ధ్యేయం గా ఉండింది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
హింస పై సమరానికి ఉద్దేశించినవి వైమానిక దాడులు మరియు సర్జికల్ స్ట్రయిక్స్
‘‘మన పొరుగు దేశం మనతో మూడు యుద్ధాలు చేసింది. అయితే, మన సేనలు అన్ని యుద్ధాల లోను దాని ని ఓడించాయి. ప్రస్తుతం అది మనతో పరోక్ష యుద్ధం చేస్తోంది. ఈ కారణం గా మన వేలాది పౌరులు చనిపోతున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘అయితే, ఈ అంశం పై ఇదివరకు చేసిన ఆలోచన ఏమిటి? దీని ని ఒక శాంతి భద్రత సంబంధిత సమస్య గా చూస్తూ వచ్చారు’’ అని ఆయన అన్నారు.
ఈ సమస్య ను అలాగే అట్టే పెడుతూ వచ్చారు. భద్రత దళాల కు కార్యాన్ని నెరవేర్చే అవకాశాన్ని ఎన్నడూ ఇవ్వలేదు అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ప్రస్తుతం భారతదేశం ఒక యువ ఆలోచనతో ను, యువ మస్తిష్కంతోను పురోగమిస్తున్నది. కాబట్టి, అది సర్జికల్ స్ట్రయిక్, వైమానిక దాడి మరియు టెరర్ క్యాంప్స్ పై నేరు గా దండెత్తగలిగింది’’ అని ఆయన అన్నారు.
ఈ చర్య ల ఫలితం గా ప్రస్తుతం దేశం లో సర్వతోముఖమైనటువంటి శాంతి నెలకొన్నది. అంతేకాకుండా, టెరరిజమ్ గణనీయం గా తగ్గిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.
జాతీయ యుద్ధ స్మారకం:
దేశం లో అమరవీరుల కోసం ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని దేశం లో కొంత మంది కోరుకోవడం లేదు అని ప్రధాన మంత్రి అన్నారు.
‘‘భద్రత దళాల స్థైర్యాని కి ఉత్తేజాన్ని ఇచ్చే కన్నా వాటి గర్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది’’ అని ఆయన అన్నారు.
యువ భారతదేశం అభిలషించిన ప్రకారం ఈ రోజు న ఒక జాతీయ యుద్ధ స్మారకాన్ని మరియు జాతీయ పోలీసు స్మారకాన్ని ఢిల్లీ లో నిర్మించడమైంది అని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తం గా సాయుధ బలగాలు ఒక పరివర్తన కు లోనవుతున్నాయి. సైన్యం, నౌకాదళం మరియు వాయుసేన ల సమన్వయాని కి ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ దిశ గా ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)ను ఏర్పాటు చేయాలన్న ఒక కోర్కె అనేక దశాబ్దుల పాటు ఉంటూ వచ్చింది అని ఆయన అన్నారు.
యువ ఆలోచనా సరళి నుండి మరియు యువ మనస్తత్వం నుండి ప్రేరణ ను పొంది ప్రభుత్వం ఒక సిడిఎస్ ను నియమించింది అని ఆయన చెప్పారు.
‘‘సిడిఎస్ పదవి ని ఏర్పాటు చేయడం మరియు నూతన సిడిఎస్ ను నియమించడం.. ఈ కార్యాల ను మా ప్రభుత్వం పూర్తి చేసింది’’ అని ఆయన తెలిపారు.
తదుపరి తరం యుద్ద విమానం– రాఫెల్ ను చేర్చుకోవడం
సాయుధ దళాల ఆధునికీకరణ మరియు సాంకేతిక స్థాయి పెంపుదల అంశాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, దేశాన్ని ప్రేమించే వారు ఎవరైనా తన దేశ భద్రత దళాలు ఆధునికం గా ఉండాలని, వాటి స్థాయి ని పెంచడం జరగాలని కోరుకుంటారు అని వివరించారు.
అయితే, భారతదేశ వాయు సేన 30 సంవత్సరాలు గడచిన తరువాత కూడా ఒక్క తదుపరి తరం యుద్ధ విమానాన్ని సంపాదించుకోలేదు అంటూ ఆయన విమర్శించారు.
‘‘మన యుద్ధ విమానాలు పాతవి. అవి ప్రమాదాల కు లోనవుతున్నాయి. దీనితో మన యుద్ధ విమానాల ను నడిపే వారు ప్రాణ త్యాగం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘ఆ కార్య భారాన్ని మేము పూర్తి చేయగలిగాము. 3 దశాబ్దాల నిరీక్షణ అనంతరం భారతదేశ వాయు సేన తదుపరి తరం యుద్ధ విమానం అయినటువంటి రాఫెల్ ను పొందగలిగినందుకు నేను ఇవాళ సంతోషిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.