ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కాబుల్ లో ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు.
‘‘కాబుల్ లో ఉగ్రవాదులు జరిపిన పేలుడును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల శోకంలో మేం పాలుపంచుకొంటున్నాం; మరియు ఈ ఘటనలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని మేం ప్రార్థిస్తున్నాం.
ఉగ్రవాదంపైన పోరాడడంలో అఫ్గానిస్తాన్ కు వెన్నంటి భారతదేశం నిలబడుతుంది. ఉగ్రవాదానికి కొమ్ముకాసే శక్తులను ఓడించవలసిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
— Narendra Modi (@narendramodi) May 31, 2017
India stands with Afghanistan in fighting all types of terrorism. Forces supporting terrorism need to be defeated.
— Narendra Modi (@narendramodi) May 31, 2017