రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పోన్ ద్వారా మాట్లాడారు.
నేత లు ఇద్దరూ యూక్రేన్ లో స్థితి ని గురించి, ముఖ్యం గా ఖార్ కీవ్ నగరం లో అనేక మంది భారతీయ విద్యార్థులు చిక్కుబడిపోవడాన్ని గురించి సమీక్షించారు. సంఘర్షణ నెలకొన్న ప్రాంతాల లో నుంచి భారత పౌరుల ను సురక్షితం గా ఖాళీ చేయించడాన్ని గురించి వారు చర్చించారు.