ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపారు.
భారత్-యూఏఈ మైత్రిని పెంపొందించేందుకు షేక్ ఖలీద్ చూపిన కృషిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.
ప్రధానమంత్రి ఎక్స్ పోస్టులో;
'అబుధాబి యువరాజు హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. భారత్-యూఏఈ మధ్య బలమైన స్నేహం పట్ల ఆయనకున్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.'
It was a delight to welcome HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi. We had fruitful talks on a wide range of issues. His passion towards strong India-UAE friendship is clearly visible. pic.twitter.com/yoLENhjGWd
— Narendra Modi (@narendramodi) September 9, 2024