మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వచ్చే మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మహారాజా సుహేల్ దేవ్ జయంతి సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్ రాయిచ్ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా పాలుపంచుకోనున్నారు.
మహారాజా సుహేల్ దేవ్ గుర్రం మీద ఆసీనుడై స్వారీ చేస్తున్నట్లు ఉండే భంగిమ లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఫలాహారశాల, అతిథి గృహం, పిల్లల కు ఉద్దేశించిన ఓ తోట ల వంటి వివిధ పర్యటక సౌకర్యాల ను అభివృద్ధిపరచడం ఈ ప్రాజెక్టు లో భాగాలుగా ఉంటాయి.
దేశం పట్ల మహారాజా సుహేల్ దేవ్ కనబరచిన సమర్పణ భావం, ఆయన వ్యక్తం చేసిన దేశ సేవ భావన ప్రతి ఒక్కరికి ప్రేరణ ను అందించేవే. ఈ స్మారక స్థలాన్ని తీర్చిదిద్దడం ద్వారా మహారాజా సుహేల్ దేవ్ వీర గాథల ను గురించి ఉత్తమమైన పద్ధతి లో తెలుసుకొనే అవకాశం దేశ ప్రజలకు లభిస్తుంది. ఈ అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం తాలూకు పర్యటక సామర్ధ్యాలు కూడా పెంపొందుతాయి.