ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ కై ఒక వేదిక ను 2020వ సంవత్సరం ఆగస్టు 13 వ తేదీ నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.
సిబిడిటి ఇటీవలి సంవత్సరాల లో అనేక ప్రధాన పన్నుల సంబంధి సంస్కరణల ను తీసుకు వచ్చింది. గడచిన సంవత్సరం లో కార్పొరేట్ ట్యాక్స్ రేటుల ను 30 శాతం నుండి 22 శాతాని కి తగ్గించడమైంది; ఇంకా, నూతన తయారీ యూనిట్ ల కు ఈ రేటుల ను 15 శాతానికి తగ్గించడం జరిగింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూశన్ ట్యాక్స్ ను కూడా తొలగించడమైంది.
పన్ను రేటుల ను తగ్గించడం మరియు ప్రత్యక్ష పన్నుల సంబంధి చట్టాల ను సరళతరం చేయడం పట్ల శ్రద్ద తీసుకోవడం జరిగింది. ఆదాయపు పన్ను విభాగం యొక్క పనితీరు లో పారదర్వకత్వాన్ని మరియు సమర్ధత ను తేవడం కోసం సిబిడిటి పలు కార్యక్రమాల ను అమలుపరచింది. వీటి లో క్రొత్త గా పరిచయం చేసిన డాక్యుమెంట్ ఐడెంటిఫికేశన్ నంబర్ (డిఐఎన్) ద్వారా ఆధికారిక సమాచార ప్రసారం లో మరింత పారదర్శకత్వాన్ని తీసుకు రావడం సైతం కలసి ఉంది. అదే ప్రకారం గా, పన్ను ల చెల్లింపుదారుల కు సులభ అనువృత్తి ని పెంచడం కోసమని మరియు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కు అనువర్తనాన్ని మరింత సుఖకరంగా మార్చుతూ ముందుగానే నింపివేసి ఉండేటటువంటి ఆదాయపు పన్ను రిటర్న్ ఫార్మ్ లను తెస్తూ ఆదాయపు పన్ను విభాగం ముందండుగు ను వేసింది. ఇదే విధం గా, స్టార్ట్- అప్ స్ కు కూడాను అనువర్తనం నియమాల ను సరళతరం చేయడం జరిగింది.
మిగిలివున్న పన్ను వివాదాల ను పరిష్కరించేందుకు ఆదాయపు పన్ను విభాగం ద డైరెక్ట్ ట్యాక్స్ ‘‘వివాద్ సే విశ్వాస్ యాక్ట్, 2020’’ ని కూడా తీసుకు వచ్చింది. దీనిలో భాగం గా వివాదాల పై నిర్ణయం తీసుకోవడం కోసం డిక్లరేశన్ లను ప్రస్తుతం దాఖలు చేయడం జరుగుతున్నది. పన్ను చెల్లింపుదారు సాధకబాధకాల ను/వ్యాజ్యాల ను ప్రభావశీల రీతి లో తగ్గించడం కోసం వేరు వేరు అపిలేట్ కోర్టుల లో డిపార్ట్ మెంటల్ అపీళ్ల ను దాఖలు చేసేందుకు ఆర్థిక ప్రభావసీమల ను పెంచడమైంది. చెల్లింపుల కై ఇలెక్ట్రానిక్ మోడ్ లు మరియు డిజిటల్ లావాదేవీల ను ప్రోత్సహించడం కోసం అనేక చర్యల ను తీసుకోవడమైంది. ఈ యొక్క కార్యక్రమాల ను ముందుకు తీసుకుపోయేందుకు ఆదాయపు పన్ను విభాగం కట్టుబడి ఉంది. కోవిడ్ కాలం లో పన్ను చెల్లింపుదారుల కోసం అనువర్తనాల ను సౌకర్యవంతం గా మార్చేందుకుగాను రిటర్న్ ల దాఖలు కు సంబంధించిన శాసనబద్ధ కాలక్రమాల ను విస్తరించడం ద్వారా ను, పన్ను చెల్లింపుదారుల చేతుల లో నగదు లభ్యత ను పెంచడం కోసం రిఫండ్ ల ను సత్వరం విడుదల చేయడం ద్వారా ను ఆదాయపు పన్ను విభాగం తన వంతు గా చొరవ తీసుకొన్నది.
‘‘ట్రాన్స్ పరెంట్ ట్యాక్సేశన్- ఆనరింగ్ ద ఆనెస్ట్’’ కై ప్రధాన మంత్రి ప్రారంభించనున్న వేదిక ప్రత్యక్ష పన్ను సంస్కరణ ల ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోనుంది.
ఈ కార్యక్రమాన్ని ఆదాయపు పన్ను విభాగం అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేశన్ లు, ట్రేడ్ అసోసియేశన్ లు, వివిధ వాణిజ్య మండలుల తో పాటు ప్రముఖ చెల్లింపుదారులు కూడా వీక్షించనున్నారు. కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా ఈ సందర్బం లో హాజరు కానున్నారు.