‘చౌరీ చౌరా’ శత జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో గల ‘చౌరీ చౌరా’ లో ఈ నెల 4న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటం లో ఒక విశిష్ట ఘట్టం అయినటువంటి ‘చౌరీ చౌరా’ ఉదంతం చోటు చేసుకొని ఆ రోజుకల్లా 100 సంవత్సరాలు అవుతాయి. ‘చౌరీ చౌరా’ శత జయంతి కి అంకితం చేసిన ఒక తపాలా బిళ్ళ ను ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ సందర్భం లో పాలుపంచుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన శతజయంతి ఉత్సవాలు, వివిధ కార్యక్రమాలు ఈ నెల 4న రాష్ట్రం లోని 75 జిల్లాలన్నింటి లో మొదలై, 2022వ సంవత్సరం లో ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.