Quote“First steps towards cleanliness taken with Swachh Bharat Abhiyan with separate toilets built for girls in schools”
Quote“PM Sukanya Samruddhi account can be opened for girls as soon as they are born”
Quote“Create awareness about ills of plastic in your community”
Quote“Gandhiji chose cleanliness over freedom as he valued cleanliness more than everything”
Quote“Every citizen should pledge to keep their surroundings clean as a matter of habit and not because it’s a program”

స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ప్రారంభించి నేటికి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భానికి గుర్తుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిల్లీలో బడి పిల్లలతో పాటు పరిశుభ్రతా పరిరక్షణ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛత వల్ల కలిగే లాభాలు ఏమిటో చెప్పండంటూ ప్రశ్నించారు. దాని వల్ల జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని ఒక విద్యార్థి జవాబిస్తూ.. స్వచ్ఛమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని తయారు చేసుకోవాలనే అవగాహనను మన ఇరుగు పొరుగులలో వ్యాప్తి చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నాడు. మరుగుదొడ్లు లేని కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయని మరో విద్యార్థి చెప్పాడు. చాలా మంది బహిర్భూమికి బహిరంగ ప్రదేశాలను ఎంచుకోక తప్పనిసరైన స్థితి ఇది వరకు ఉండేదని, దీంతో రోగాలు పుట్టల్లా పెరిగాయని, మహిళలు చెప్పరాని అవస్థలు పడ్డారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పాఠశాలల్లో బాలికల కోసం విడిగా మరుగుదొడ్లను నిర్మించడంతో స్వచ్ఛ్ భారత్ అభియాన్ తొలి అడుగులు పడ్డాయని, బడికి వెళ్లడం మానేస్తున్న అమ్మాయిల సంఖ్య

 

|

ఈ చర్యతో ఒక్కసారిగా బాగా తగ్గిపోయిందని ప్రధానమంత్రి వివరించారు.

మహాత్మా గాంధీజీ జయంతిని, ఇంకా లాల్ బహాదుర్ శాస్త్రీజీ జయంతిని ఈ రోజున మనం జరుపుకొంటున్నట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు. యోగాను అభ్యసిస్తున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతూ పోతుండడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యోగాసనాలు ఎంత ప్రయోజనకరమన్న సంగతిని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. కొందరు బాలలు ఈ సందర్భంగా ప్రధాని కళ్లెదుట కొన్ని ఆసనాలను వేయడంతో, అక్కడ ఉన్న వారంతా చప్పట్లు కొట్టి, మెచ్చుకొన్నారు. మంచి పోషణ పైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఉందని కూడా ప్రధాని అన్నారు. పిఎమ్-సుకన్య యోజన గురించి మీకేం తెలుసో చెప్పగలరా అంటూ ప్రధానమంత్రి అడగడంతో, ఒక విద్యార్థి లేచి నిలబడి ఆ పథకాన్ని గురించి చెప్పాడు. ఆ పథకంలో బాలికల కోసం బ్యాంకులో ఖాతాను తెరవచ్చని, వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ పథకం వారికి ఆర్థికంగా ఆదుకుంటుందని తెలిపాడు. పీఎమ్ సుకన్య సమృద్ధి ఖాతాను ఆడపిల్లలు పుట్టగానే ప్రారంభించవచ్చని ప్రధాని చెబుతూ... ఏటా ఒక వేయి రూపాయలను జమ చేస్తూ ఉండాలనీ, ఆ విధంగా పోగైన డబ్బును ఆడపిల్లలు పెద్దవారయ్యాక వారి చదువుల కోసం, పెళ్లి కోసం ఉపయోగించుకోవచ్చన్నారు. ఆ డిపాజిట్ పద్దెనిమిది సంవత్సరాల్లో 50 వేల రూపాయలు అవుతుందనీ, వడ్డీగా 32 వేల రూపాయల నుంచి 35 రూపాయల వరకు ఉంటుందని ఆయన అన్నారు. అమ్మాయిలకు 8.2 శాతం వరకు వడ్డీ ఇస్తారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

|

స్వచ్ఛత ప్రధానాంశంగా బాలలు ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారు. గుజరాత్ లో నీటిఎద్దడి ఉన్న ప్రాంతంలో స్కూలు పిల్లల్లో ప్రతి ఒక్కరికీ ఒక మొక్కను అప్పగించి, విద్యార్థులు రోజూ వారి ఇళ్లలో నుంచి నీటిని తీసుకు వచ్చి ఆ నీటిని మొక్కలకు పోయాలని చెప్పిన సంగతి తనకు తెలుసునని ఆయన చెప్పారు. అదే బడికి అయిదు సంవత్సరాల తరువాత తాను వెళ్లినప్పుడు అంతకు ముందు లేనటువంటి అపూర్వమైన పచ్చదనంతో ఆ పరిసరాలు కళకళలాడడం తాను చూశానని ప్రధాని అన్నారు. చెత్తను వేరుపరచి, ఎరువును తయారు చేయడం వల్ల ఎన్ని లాభాలుంటాయో కూడా విద్యార్థినీవిద్యార్థులకు ప్రధాని తెలియజెప్పి, ఈ పనిని మీ ఇళ్ల వద్ద కూడా చేస్తూ ఉండండి అంటూ వారిని ప్రోత్సహించారు. ‘‘అలాగే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గురించి కూడా మీ చుట్టుపక్కల వారు అందరూ అర్థం చేసుకొనేటట్టుగా చెప్పండి. దానికి బదులు గుడ్డతో తయారైన సంచీని వాడమనండి’’ అని కూడా ఆయన సూచించారు.

 

|

శ్రీ నరేంద్ర మోదీ బాలలతో మాట్లాడుతూ... అక్కడి బోర్డు మీద రాసి ఉన్న గాంధీజీ కళ్లద్దాలను చూపించి ‘‘ఇక్కడంతా స్వచ్ఛతను కాపాడుతున్నారో లేదోనని గాంధీ గారు గమనిస్తూంటారు. కాబట్టి ఈ విషయంలో సావధానంగా ఉండండి పిల్లలూ...’’ అని అన్నారు. గాంధీ గారు బ్రతికి ఉన్నంత కాలం.. స్వచ్ఛత కోసం పాటుపడ్డారని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్యం, పరిశుభ్రత- ఈ రెండిటిలో మీరు దేనిని ఎంపిక చేసుకొంటారంటూ గాంధీ గారిని అడిగినప్పుడు, ఆయన స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతనే ఎంచుకొన్నారు. ఎందుకంటే ఆయన దృష్టిలో స్వచ్ఛత కు మించింది మరేదీ లేదు అని శ్రీ మోదీ తెలిపారు. స్వచ్ఛత ను కాపాడుకోవడాన్ని ఒక కార్యక్రమంగా చూడాలా, లేక ఒక అలవాటుగా చూడాలా అని విద్యార్థులను అడిగిన మీదట, విద్యార్థులంతా ‘స్వచ్ఛతా పరిరక్షణను ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ముక్తకంఠంతో బదులిచ్చారు. ‘‘శుభ్రపరచడం ఏ ఒక్క వ్యక్తి బాధ్యతో, లేదా ఏ ఒక్క కుటుంబం బాధ్యతో, లేదా ఒక్క సారితో ముగిసే కార్యక్రమమో కాదు.. అది ఒక మనిషి అతడు గాని, ఆమె గాని జీవించి ఉన్నంత వరకు అలా కొనసాగుతూ ఉండవలసిన కార్యమే పరిశుభ్రత’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘నేను నా చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతమాత్రం మురికిగా ఉండనివ్వను’’ అనేదే దేశంలో ప్రతి ఒక్కరు అనుసరించవలసిన విధి అని విద్యార్థులతో ఆయన చెప్పారు. బాలల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ‌ను ప్రధాన మంత్రి చేయించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India receives over $100 billion remittances for three consecutive years

Media Coverage

India receives over $100 billion remittances for three consecutive years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on his Jayanti
April 01, 2025

The Prime Minister Shri Narendra Modi paid tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti today. Hailing his extraordinary efforts, Shri Modi lauded him as a beacon of compassion and tireless service, who showed how selfless action can transform society.

In separate posts on X, he wrote:

“Heartfelt tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti. He is remembered as a beacon of compassion and tireless service. He showed how selfless action can transform society. His extraordinary efforts across various fields continue to inspire generations.”

“ಪರಮಪೂಜ್ಯ ಡಾ. ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಶಿವಕುಮಾರ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಜಯಂತಿಯ ಈ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮನಗಳು. ಕಾರುಣ್ಯ ಮತ್ತು ದಣಿವರಿಯದ ಸೇವೆಯ ದಾರಿದೀಪವೆಂದು ಅವರನ್ನು ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ. ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಯು ಸಮಾಜವನ್ನು ಹೇಗೆ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಅವರು ತೋರಿಸಿದ್ದಾರೆ. ನಾನಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅವರ ಅಸಾಧಾರಣ ಪ್ರಯತ್ನಗಳು ಪೀಳಿಗೆಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡುತ್ತಲೇ ಇವೆ.”