కొరియా గణతంత్రం (ఆర్ఒకె) కు అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ యూన్ సుక్-యోల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ లో మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఆర్ఒకె అధ్యక్ష ఎన్నికల లో శ్రీ యూన్ సుక్-యోల్ గెలిచినందుకు ప్రధాన మంత్రి ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
వర్తమాన ప్రపంచ స్థితిగతులను దృష్టి లో పెట్టుకొని భారతదేశం-కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా విస్తరింపచేసుకోవడానికి మరియు పటిష్టపరచుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిఉందనే విషయం లో నేత లు ఇరువురు సమ్మతి ని వ్యక్తం చేశారు. శీఘ్రతర ద్వైపాక్షిక సహకారానికి అవకాశాలు ఉన్న వివిధ రంగాల ను గురించి వారు చర్చించి, ఈ అంశం లో కలసి పనిచేసేందుకు అంగీకరించారు.
భారతదేశానికి మరియు ఆర్ఒకె కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన పరిణామం తాలూకు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే సంవత్సరం లో సంయుక్తం గా జరపాలన్న తమ అభిలాష ను కూడా ఇద్దరు నేత లు ఉద్ఘాటించారు.
శ్రీ యూన్ సుక్-యోల్ ఆయన కు వీలయినంత త్వరలో భారతదేశాన్ని సందర్శించేందుకు రావలసిందంటూ ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు.