అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకుపోయేందుకు ఉద్దేశించిన ‘‘జన్ ధన్ యోజన’’ కార్యక్రమం ఈ రోజుతో పది వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా, ఈ పథకం విజయాన్ని చాటి చెబుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే పది సంఖ్యలు, వాటి గురించి వివరణ ఉన్న ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘జన్ ధన్ యోజన సాధించిన విజయం ఏ స్థాయిలో ఉన్నదీ సృజనాత్మకంగా వెల్లడించిన ఈ సందేశాన్ని గమనించండి. #10YearsOfJanDhan’’
A glimpse of the success of Jan Dhan Yojana, presented creatively in this thread. #10YearsOfJanDhan https://t.co/ykndIcpSo3
— Narendra Modi (@narendramodi) August 28, 2024