ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం హోన్ హాయి టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో సమావేశమయ్యారు. అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముడిపడ్డ రంగాలలో భారతదేశం ఆశ్చర్యకర అవకాశాలను ఇవ్వజూపుతోందని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రకటిస్తూ, భారతదేశంలో ఫాక్స్ కాన్ పెట్టుబడి పథకాలపై చర్చించారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘హోన్ హాయి టెక్నాలజీ గ్రూపు (ఫాక్స్ కాన్) చైర్ మన్ శ్రీ యంగ్ లియూ తో సమావేశం సంతోషం కలిగించింది. అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ముడిపడ్డ రంగాలలో భారతదేశం ఆశ్చర్యకర అవకాశాలను ఇవ్వజూపుతోందని నేను సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించాను. భారతదేశంలో కర్నాటక, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వారి పెట్టుబడి పథకాలపై కూడా మేం ఫలప్రద చర్చలు జరిపాం.’’ అని తెలిపారు.
Wonderful to meet Mr. Young Liu, the Chairman of Hon Hai Technology Group (Foxconn). I highlighted the wonderful opportunities India offers in futuristic sectors. We also had excellent discussions on their investment plans in India in states like Karnataka, Tamil Nadu and Andhra… pic.twitter.com/5tT4xfF51u
— Narendra Modi (@narendramodi) August 14, 2024