ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన 35వ ఆసియాన్ సమిట్, 14వ ఈస్ట్ ఆసియా సమిట్ (ఇఎఎస్) మరియు 16వ ఇండియా-ఆసియాన్ సమిట్ ల సందర్భం లో థాయిలాండ్ ప్రధాని జనరల్ (రిటైర్డ్) శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా తో భేటీ అయ్యారు
ఈ సమావేశం లో ఉభయ నేత లు ద్వైపాక్షిక సంబంధాల లో పురోగతి ని సమీక్షించారు. రెండు పక్షాల మధ్య తరచు గా జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు మరియు రాక పోక లు ఈ సంబంధాని కి సకారాత్మకమైన గతి ని ఇవ్వడాన్ని వారు గమనించారు. రక్షణ రంగం లోను, భద్రత రంగం లోను అనుబంధం పెంపొందడాన్ని పరిగణన లోకి తీసుకొంటూ, రక్షణ పరిశ్రమల రంగం లో సహకరించుకోవడాని కి గల అవకాశాల ను అన్వేషించేందుకు వారు అంగీకరించారు. కిందటి సంవత్సరం లో ద్వైపాక్షిక వ్యాపారం లో 20 శాతం వృద్ధి నమోదు కావడాన్ని నేతలు స్వాగతిస్తూ, వ్యాపారాన్ని మరియు పెట్టుబడి ని అధికం చేసుకొనేందుకు ఉన్న మార్గాలపైన మరియు సాధనాల పైన చర్చించే బాధ్యత ను వ్యాపార అధికారుల కు అప్పజెప్పాలని నిర్ణయించారు.
భౌతిక సంధానం మరియు డిజిటల్ కనెక్టివిటీ.. ఈ రంగాల తో పాటు, ఇరు దేశాల మధ్య సంధానాన్ని ఉన్నతీకరించుకొనేందుకు గల మార్గాల ను గురించి కూడా ప్రధానులు ఇరువురూ చర్చించారు. రెండు దేశాల మధ్య విస్తరిస్తున్న గగనతల సంధానాన్ని నేతలు ఇరువురూ స్వాగతించారు. బ్యాంకాక్ మరియు గువాహాటీ మధ్య ఒక నేరు విమాన సర్వీసు ప్రారంభం కావడాన్ని, అలాగే థాయిలాండ్ లోని రానోంగ్ నౌకాశ్రయాని కి మరియు భారతదేశం లోని కోల్‌కాతా, చెన్నై, ఇంకా విశాఖపట్నం నౌకాశ్రయాల కు మధ్య సహకారాని కి ఉద్దేశించిన ఒప్పందాల కు తుది రూపు ను ఇవ్వడాన్ని కూడా వారు స్వాగతించారు.
పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల పైన మరియు బహుపాక్షిక అంశాల పైన నేతలు ఒకరి అభిప్రాయాల ను మరొకరికి వెల్లడి చేసుకొన్నారు. ఆసియాన్ కు సంబంధించిన సమావేశాల లో పాలు పంచుకోవలసింది గా తన ను ఆహ్వానించినందుకు థాయి ప్రధాని కి ప్రధాన మంత్రి శ్రీ మోదీ ధన్యవాదాలు పలికారు. ఆసియాన్ అధ్యక్ష పదవి ని స్వీకరించి నాయకత్వం వహిస్తున్నందుకు కూడాను ఆయన కు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా-ఆసియాన్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ సమన్వయ కర్త దేశం గా థాయిలాండ్ అందించిన తోడ్పాటు ను ఆయన సానుకూలం గా మదింపు చేశారు.
థాయిలాండ్ మరియు భారతదేశం సముద్ర తీరం పరం గా సన్నిహితమైన ఇరుగు పొరుగు దేశాలు గా ఉంటూ, చరిత్రాత్మకమైన మరియు సాంస్కృతిక పరమైన సంబంధాల ను నెలకొల్పుకొన్నాయి. సమకాలీన సందర్భం విషయాని కి వస్తే భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం థాయిలాండ్ అవలంభిస్తున్న ‘లుక్ వెస్ట్’ విధానాని కి పూరకం గా ఉండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాన్ని గాఢం గా, పటిష్టం గా మరియు బహుముఖీనం గా మార్చివేసింది.
การประชุมหารือกับพลเอก ประยุทธ์ จันทร์โอชาประสบผลสำเร็จอย่างดียิ่ง โดยเราได้พูดคุยเกี่ยวกับแนวทางในการขยายความร่วมมือระหว่างอินเดียและไทย ผมยังได้กล่าวขอบคุณท่านสำหรับการต้อนรับอันดีเยี่ยมของประชาชนและรัฐบาลไทย pic.twitter.com/EZEhaBIn1W
— Narendra Modi (@narendramodi) November 3, 2019
Had an excellent meeting with Prime Minister Prayut Chan-o-cha. We talked about ways to expand cooperation between India and Thailand. I also thanked him for the wonderful hospitality of the people as well as Government of Thailand. pic.twitter.com/79pMhf8MV1
— Narendra Modi (@narendramodi) November 3, 2019