ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం నవంబర్ 3వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఆసియాన్/ఇఎఎస్ సంబంధిత సమావేశాల సందర్భం గా ఇండొనేశియా గణతంత్రం అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ జోకో విడోడో తో సమావేశమయ్యారు.
ఇండొనేశియా అధ్యక్షుని గా శ్రీ విడోడో రెండో పదవీకాలాని కి గాను ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు. భారతదేశం మరియు ఇండోనేశియా లు ప్రపంచం లో కెల్లా రెండు అతి పెద్దవైన ప్రజాస్వామిక దేశాలు గాను, బహుళత్వ సమాజాలు గాను ఉన్నాయని, రక్షణ, భద్రత, సంధానం, వ్యాపారం, పెట్టుబడి మరియు ప్రజా సమూహాల రాక- పోక ల వంటి రంగాల లో సంబంధాల ను బలోపేతం చేసుకోవడం కోసం ఇండోనేశియా తో కలసి పని చేసేందుకు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భం గా వెల్లడించారు.
ఇండోనేశియా మరియు భారతదేశం సాగర తీరం కలిగిన సన్నిహిత ఇరుగు పొరుగు దేశాలు గా ఉన్నాయని ఇరువురు నేతలు గుర్తు కు తెచ్చుకొంటూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో సముద్ర సంబంధి సహకారం అంశం పై వారి ఉమ్మడి దార్శనికత ను ఆచరణ రూపం లోకి తీసుకొని రావడానికై శాంతి కోసం, భద్రత కోసం మరియు సమృద్ధి కోసం కలసి పని చేయాలన్న తమ నిబద్ధత ను పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం మరియు తీవ్రవాదం.. ఈ జంట బెదరింపుల ను గురించి నేత లు ఉభయులూ చర్చించారు. ఈ భూతం తో పోరాడటం కోసం ద్వైపాక్షిక స్థాయి లోను, ప్రపంచ స్థాయి లోను సన్నిహితం గా పని చేయడాని కి వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంపొందింపజేసుకోవడం ఎలా అన్నదాని పై ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఒక దూరగామి ప్రభావం కలిగిన చర్చ ను జరిపారు. ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంకా, ఆటోమోటివ్ ఉత్పత్తులు సహా భారతీయ సరకుల కు మరింత విశాలమైన విపణి అందుబాటు లోకి రావలసిన ఆవశ్యకత ఉందన్న సంగతి ని ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ఇండోనేశియా లో భారతీయ కంపెనీలు గణనీయమైన స్థాయి లో పెట్టుబడి పెట్టినట్లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొంటూ, భారతదేశం లో పెట్టుబడి కి ఉన్న అవకాశాల ను వినియోగించుకోవలసిందంటూ ఇండోనేశియా కంపెనీల ను ఆహ్వానించారు.
తరువాతి సంవత్సరం లో పరస్పరం అనువైన కాలం లో భారతదేశాన్ని సందర్శించేందుకు తరలి రావలసిందంటూ అధ్యక్షుడు శ్రీ విడోడో కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానం పలికారు.
ఇండోనేశియా తో తన ద్వైపాక్షిక సంబంధాని కి ఉన్నత ప్రాథమ్యాన్ని భారతదేశం కట్టబెడుతోంది. భారతదేశం కోంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను ఇండోనేశియా తో కలసి పంచుకొంటోంది. భారతదేశం, ఇండోనేశియా లు వాటి మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్న అనంతరం 70వ వార్షికోత్సవాన్ని సైతం ఈ సంవత్సరం లోనే జరుపుకోబోతున్నాయి.
Senang bertemu Presiden @jokowi. Pembicaraan kami hari ini sangat luas. Kami membahas cara untuk memperluas kerja sama antara India dan Indonesia di berbagai bidang seperti perdagangan dan budaya. pic.twitter.com/IuKvPTSFeH
— Narendra Modi (@narendramodi) November 3, 2019
Happy to have met President @jokowi. Our talks today were wide-ranging. We discussed ways to expand cooperation between India and Indonesia in areas such as trade and culture. pic.twitter.com/QD264Ay4qc
— Narendra Modi (@narendramodi) November 3, 2019