ప్రొబేషన్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.
కొన్నేళ్లుగా పోలీస్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, సైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై వారితో చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
'76 ఆర్ఆర్ ఐపీఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడాను. ప్రజలకు సేవ చేయాలనే వారి ప్రయత్నానికి శుభాకాంక్షలు తెలియజేశాను. కొన్నేళ్లుగా పోలీస్ వ్యవస్థ ఎలా మారిందో, సైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం ఎందుకు ముఖ్యమో చర్చించాను. @svpnpahyd
Interacted with IPS Probationers of 76 RR earlier today. Wished them the very best in their endeavour of serving people. Discussed how policing has changed over the years and how it has become important to tackle new challenges like cyber crime. @svpnpahyd pic.twitter.com/scEoj2mPZ8
— Narendra Modi (@narendramodi) October 4, 2024