ప్రధాన మంత్రి గతిశక్తి యోజన (జాతీయ మాస్టర్ ప్లాన్) మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన పోస్ట్ ను, మైగవ్ లోని థ్రెడ్ పోస్ట్ ను షేర్ చేస్తూ ప్రధాన మంత్రి ఇలా పేర్కొన్నారు.
“దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన పరివర్తనాత్మక కార్యక్రమంగా పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆవిర్భవించింది. ఇది బహుళ అత్యాధునిక అనుసంధానాన్ని (మల్టీమోడల్ కనెక్టివిటీని) గణనీయంగా పెంచింది, అన్ని రంగాలలో వేగవంతమైన , మరింత సమర్థమంతమైన అభివృద్ధికి దోహదపడుతోంది.“
“వివిధ వ్యవస్థల నిరంతర అనుసంధానం రవాణా సౌకర్యాలు మెరుగు పరచడానికి, జాప్యాన్ని తగ్గించడానికి , అనేక మందికి కొత్త అవకాశాలను సృష్టించడానికి దారితీసింది.”
“'గతిశక్తికి ధన్యవాదాలు, ఇది వికసిత్ భారత్ దిశగా భారత్ ను వేగంగా అడుగులు వేయిస్తోంది. ఇది పురోగతి, వ్యవస్థాపకత , ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.”
PM #GatiShakti National Master Plan has emerged as a transformative initiative aimed at revolutionizing India’s infrastructure. It has significantly enhanced multimodal connectivity, driving faster and more efficient development across sectors.
— Narendra Modi (@narendramodi) October 13, 2024
The seamless integration of… https://t.co/aQKWgY0sFs