ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్వరలో నైజీరియాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, నైజీరియాలోని హిందీ భాషా ప్రేమికులు ఆయనకు స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనలో రేకెత్తిన ఉత్సాహాన్ని ఈ రోజున సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు.
సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో ఇటీవల పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
नाइजीरिया के हिन्दी प्रेमियों ने जिस प्रकार वहां के मेरे दौरे को लेकर उत्साह दिखाया है, वो हृदय को छू गया है! अपनी इस यात्रा को लेकर बहुत उत्सुक हूं। @MEAIndia@NigeriaMFA https://t.co/KtQJYUFjty
— Narendra Modi (@narendramodi) November 14, 2024
‘‘నైజీరియాలో హిందీ భాషా ప్రేమికులు అక్కడ నేను పర్యటించవలసి వుండగా అంతకు ముందే ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన తీరు మనసుకు హత్తుకొనేలా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ పర్యటనకు బయలుదేరివెళ్తానా అని నా మనసు ఉరకలు వేస్తోంది.’’