థాయిలాండ్ నూతన ప్రధానిగా పైటాంగ్ధన్ చిన్నావత్ ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆమెకు అభినందనలు తెలిపారు. నాగరికత, సంస్కృతి, ప్రజల మధ్య పరస్పర సంబంధాలే బలమైన పునాదులుగా ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢతరంగా మలచాలని ఆసక్తిని శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక రాసిన ఒక సందేశంలో-
‘‘థాయిలాండ్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా @ingshin గారు, మీకు ఇవే అభినందనలు. మీ పదవీకాలం చాలా చాలా సఫలవంతం కావాలి. ఇందుకు మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. నాగరికత, సంస్కృతి, ప్రజల మధ్య పరస్పర సఖ్యతలే బలమైన పునాదులుగా భారతదేశానికి, థాయిలాండ్ ల ద్వైపాక్షిక సంబంధాలను మరింత దృఢతరంగా మలచడానికి మీతో కలసి పనిచేసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Congratulations @ingshin on your election as the Prime Minister of Thailand. Best wishes for a very successful tenure. Look forward to working with you to further strengthen the bilateral ties between India and Thailand, that are based on the strong foundations of civilisational,…
— Narendra Modi (@narendramodi) August 18, 2024