మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత హాకీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
వారు సాధించిన విజయం వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఒక అసాధారణ విజయం!
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొన్న సందర్భంగా మన హాకీ జట్టుకు అభినందనలు. వారు ఈ పోటీలో మొదటి నుంచి ఎంతో బాగా ఆడారు. వారు సాధించిన విజయం ఎంతో మంది వర్ధమాన క్రీడాకారులకు ప్రేరణను అందిస్తుంది’’
A phenomenal accomplishment!
— Narendra Modi (@narendramodi) November 21, 2024
Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes.