అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవడంలో జన్ ధన్ యోజన గొప్ప ప్రభావాన్ని చూపిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ రోజుతో ఈ పథకం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ పథకం లబ్ధిదారులకు, ఈ పథకాన్ని విజయవంతం చేసిన వారు అందరికీ ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. ఆర్థిక సేవలను అందరి చెంతకు తీసుకుపోవడంలోను, కోట్లాది ప్రజలకు, ప్రత్యేకించి మహిళలు, యువతీ యువకులు, సమాజాదరణకు నోచుకోకుండా దూరంగా మిగిలిపోయిన వారందరికీ వారి ఆత్మగౌరవాన్ని పెంచడంలో జన్ ధన్ యోజన అగ్ర స్థానాన నిలిచిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఈ రోజున, మనం ఒక మహత్తరమైన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్నాం - అదే ‘జన్ ధన్ యోజన’కు పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం (#10YearsOfJanDhan). లబ్ధిదారులకు, ఈ పథకాన్ని విజయవంతం చేయడంలో శ్రమించిన వారందరికీ అభినందనలు. సమాజంలో అన్ని వర్గాల వారికీ ఆర్థిక సేవలు అందేటట్లుగా ఆ సేవలను పెంచడంలో, కోట్ల కొద్దీ దేశ ప్రజలకు, విశేషించి మహిళలకు, యువతకు, సమాజ ఆదరణకు నోచుకోకుండా దూరంగా మిగిలిపోయిన వర్గాల వారికి తల ఎత్తుకొని జీవించే అవకాశాన్ని ఇవ్వడంలో జన్ ధన్ యోజనది సర్వోన్నత పాత్ర అని చెప్పాలి.’’
Today, we mark a momentous occasion— #10YearsOfJanDhan. Congratulations to all the beneficiaries and compliments to all those who worked to make this scheme a success. Jan Dhan Yojana has been paramount in boosting financial inclusion and giving dignity to crores of people,… pic.twitter.com/VgC7wMcZE8
— Narendra Modi (@narendramodi) August 28, 2024
आज देश के लिए एक ऐतिहासिक दिन है- #10YearsOfJanDhan. इस अवसर पर मैं सभी लाभार्थियों को शुभकामनाएं देता हूं। इस योजना को सफल बनाने के लिए दिन-रात एक करने वाले सभी लोगों को भी बहुत-बहुत बधाई। जन धन योजना करोड़ों देशवासियों, विशेषकर हमारे गरीब भाई-बहनों को आर्थिक रूप से सशक्त बनाने… pic.twitter.com/e0vwfaQwkX
— Narendra Modi (@narendramodi) August 28, 2024