హర్యానాలోని కైతాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘హర్యానాలోని కైతాల్‌లో రోడ్డు ప్రమాదం జరగడం హృదయ విదారకం. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ దైవం వారికి ఆవేదనను తట్టుకునే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలన యంత్రాంగం తక్షణం రక్షణ-సహాయ చర్యలు చేపట్టింది.’’ అని ప్రధాని ప్రకటించినట్లు పేర్కొంది.
हरियाणा के कैथल में हुआ सड़क हादसा हृदयविदारक है। इसमें जान गंवाने वालों के शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन मौके पर हरसंभव मदद में जुटा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 12, 2024