జ్ఞాని జోగీందర్ సింగ్ వేదాంతి కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘జ్ఞాని జోగీందర్ సింగ్ వేదాంతి గొప్ప పండితులేగాక ఎంతో వినయసంపన్నులు. నిస్వార్థ మానవ సేవకు ఆయన జీవితం ఒక నిదర్శనం. దయార్ద్ర, సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి ఆయనెంతో కృషి చేశారు. ఆయన తుదిశ్వాస విడవటం నాకెంతో వేదన కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Giani Joginder Singh Vedanti Ji was scholarly and humble. His life was a manifestation of selfless human service. He worked to create a compassionate and harmonious society. Pained by his demise. Condolences to his family and admirers.
— Narendra Modi (@narendramodi) May 15, 2021