భారతదేశంలో పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘ఉడాన్’ (ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్) పథకం ఎనిమిదో వార్షికోత్సవం ఈ రోజు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ‘ఉడాన్’ పథకాన్ని ప్రశంసించారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రధాన విజయాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
సామాజిక, ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా ఒక సందేశాన్ని రాశారు :
‘‘మనం ఈ రోజున #8YearsOfUDAN ను జరుపుకొంటున్నాం. ఈ కార్యక్రమం భారతదేశంలో విమానయాన రంగం రూపురేఖలను మార్చివేసింది. విమానాశ్రయాల సంఖ్యను పెంచడం మొదలు, మరిన్ని విమానయాన మార్గాలను అందుబాటులోకి తీసుకు రావడం వరకు పరిశీలిస్తే- కోట్లాది మంది ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వ్యాపారాన్నీ, వాణిజ్యాన్నీ పెంపొందింప చేయడంలో ప్రభావాన్ని చూపడంతోపాటు, ప్రాంతీయ వృద్ధికి ఊతంగా కూడా నిలిచింది. రాబోయే కాలంలో- విమానయాన రంగాన్ని మరింత పటిష్ట పరుస్తామనీ, ప్రజలకు మెరుగైన అనుసంధానాన్నీ, సౌకర్యాల్నీ కల్పించేందుకు కృషి చేస్తాం’’.
Today, we mark #8YearsOfUDAN, an initiative that has transformed India’s aviation sector. From an increase in number of airports to more air routes, this scheme has ensured crores of people have access to flying. At the same time, it has had a major impact on boosting trade and… https://t.co/dnSNswBTsV
— Narendra Modi (@narendramodi) October 21, 2024