మాల్దీవ్స్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
కోవిడ్ మహమ్మారి కి వ్యతిరేకం గా పోరాటం లో భారతదేశం సహకారాని కి, సమర్థన కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అధ్యక్షుడు శ్రీ సోలిహ్ ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశం సమర్ధన తో మాల్దీవ్స్ లో అమలవుతున్న అభివృద్ధి పథకాల లో పురోగతి ని నేత లు ఇరువురు సమీక్షించారు. కోవిడ్ మహమ్మారి తాలూకు పరిమితులు ఉన్నప్పటికీ, ఆ పథకాలు శరవేగం గా అమలు జరుగుతుండడం పట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చేశారు.
భారతదేశం అనుసరిస్తున్న ‘నేబర్ హుడ్ ఫస్ట్’ సూత్రం లోను, సెక్యూరిటీ ఎండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజియన్ (ఎస్ఎజిఎఆర్) తాలూకు సముద్ర సంబంధి దృష్టి కోణం లోను మాల్దీవ్స్ ఒక కేంద్రీయ స్తంభం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మాల్దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అబ్దుల్లా శాహిద్ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ కు అధ్యక్షుని గా ఎన్నికైనందుకు గాను అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మొహమద్ సోలిహ్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
నేత లు ఉభయుల మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ మొత్తం మీద ద్వైపాక్షిక సంబంధాల ను పరిశీలించేందుకు, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న గణనీయమైనటువంటి సహకారాని కి మరింత జోరు ను, మార్గదర్శకత్వాన్ని అందించేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది.
Spoke with President @ibusolih of Maldives. Assured him of India's commitment to support Maldives in the fight against the COVID-19 pandemic. We also reviewed progress of bilateral development projects. Conveyed congratulations for the election of FM Shahid as UNGA President.
— Narendra Modi (@narendramodi) July 14, 2021