విద్యార్థుల సాఫ‌ల్యం, సంస్థ స‌ఫ‌ల‌త‌ లు ఎమ్‌జిఆర్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటాయి: ప్ర‌ధాన మంత్రి
భార‌తీయ వైద్య వృత్తి నిపుణులంటే గొప్ప గౌర‌వం, ప్ర‌శంస దక్కుతున్నాయి: ప‌రం ధాన మంత్రి
మ‌హ‌మ్మారి అనంత‌ర కాలం లో వైద్యులంటే గౌర‌వం మ‌రింత అధికం అయింది: ప్ర‌ధాన‌ మంత్రి
స్వార్థపరత్వం కంటె మించి ఎదగడం మిమ్మ‌ల్ని నిర్భ‌యులుగా చేస్తుంది: విద్యార్థుల‌ కు సూచించిన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు డాక్ట‌ర్ ఎమ్‌.జి.ఆర్‌. వైద్య విశ్వ‌విద్యాల‌యం 33వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. ఈ స్నాత‌కోత్స‌వ సంద‌ర్భం లో 21,000 మంది కి పైగా అభ్య‌ర్థుల కు డిగ్రీల‌ ను, డిప్లొమా ల‌ను ప్ర‌దానం చేయ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం లో తమిళ నాడు గవర్నరు శ్రీ బన్ వారీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.

 

విద్యార్థుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, డిగ్రీల‌ ను, డిప్లొమా ల‌ను అందుకొన్న‌ వారిలో 70 శాతానికి పైగా మ‌హిళ‌లు ఉండ‌టం పట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ప‌ట్ట‌భ‌ద్రులు అంద‌రినీ ఆయ‌న అభినందిస్తూ, ముఖ్యంగా మ‌హిళా అభ్య‌ర్ధుల కు ప్ర‌త్యేక ప్ర‌శంస‌లను తెలియజేశారు. ఏ రంగం లో అయినా మ‌హిళ‌ లు ముందు వ‌రుస‌ లో ఉండగా చూడ‌టమనేది ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన విష‌య‌మే అని ఆయ‌న అన్నారు. ఇది జ‌రిగిన‌ప్పుడు గ‌ర్వం గాను, ఉల్లాసం గాను ఉంటుంద‌న్నారు.

 

సంస్థ విద్యార్థుల సాఫ‌ల్యం, సంస్థ సాధించిన స‌ఫ‌ల‌త‌ మ‌హ‌నీయుడు ఎమ్‌ జిఆర్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఎమ్‌ జిఆర్ పాల‌న అంతా పేద‌ల ప‌ట్ల క‌రుణ‌ తో నిండిపోయింద‌ని శ్రీ మోదీ గుర్తు కు తెచ్చారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ, విద్య, మ‌హిళ‌ల‌ కు సాధికారిత క‌ల్ప‌న అనే అంశాలు ఆయ‌న కు ప్రీతిపాత్ర‌మైన‌వ‌న్నారు. ఎమ్‌జిఆర్ పుట్టిన‌ శ్రీ లంక లో మ‌న త‌మిళ సోద‌రీమ‌ణుల, సోద‌రుల కోసం ఆరోగ్య రంగం లో కృషి చేయ‌డం అనేది భార‌త‌దేశాని కి గౌర‌వప్ర‌ద‌మైన అంశ‌మ‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం ఆర్థిక స‌హాయాన్ని అందించిన ఎమ్ బ్యులన్స్ స‌ర్వీసు ను శ్రీ లంక లో త‌మిళ స‌ముదాయం విరివిగా ఉప‌యోగించుకొంటోందన్నారు. ఆరోగ్య సంర‌క్ష‌ణ దిశ లో జ‌రుగుతున్న ఈ ప్ర‌య‌త్నాలు, అదీ తమిళ సముదాయానికి ఉద్దేశించిన ప్రయాసలు ఎమ్‌ జిఆర్ కు ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఉంటాయ‌ని ఆయ‌న అన్నారు.

 

భార‌త‌దేశాని కి చెందిన వైద్య వృత్తి నిపుణులు, శాస్త్రవేత్త‌లు, ఔష‌ధ‌ నిర్మాణ రంగ వృత్తి నిపుణులంటే ఎంతో గౌర‌వం, అభిమానం ఉన్నాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశం ప్రపంచం కోసం మందుల ను, టీకామందుల ను ఉత్ప‌త్తి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. కోవిడ్‌-19 కాలం లో భార‌త‌దేశం ప్ర‌పంచం లో కెల్లా అతి త‌క్కువ మ‌ర‌ణాల రేటు తో పాటు ఆ వ్యాధి బారిన ప‌డి తిరిగి కోలుకొన్న వారి ప‌రం గా చూసినా కూడాను అత్య‌ధిక రేటు ను క‌లిగివుంది అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశ హెల్థ్ ఇకోసిస్ట‌మ్ ను నూత‌న దృష్టి తో, నూత‌న గౌర‌వం తో, నూత‌న విశ్వ‌స‌నీయ‌త తో గ‌మ‌నించ‌డం జ‌రుగుతోంది అని ఆయ‌న అన్నారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి నేర్చుకొన్న అంశాలు, క్ష‌య వంటి ఇత‌ర వ్యాధుల‌ తో సైతం మ‌నం పోరాడ‌డం లో స‌హాయ‌కారి కాగ‌ల‌వు అని ఆయ‌న చెప్పారు.

ప్ర‌భుత్వం యావ‌త్తు వైద్య విద్య తో పాటు ఆరోగ్య రంగం లో కూడా పరివర్తన ను తీసుకు వ‌స్తోంద‌ని ప్ర‌ధాన ‌మంత్రి అన్నారు. కొత్త వైద్య క‌ళాశాల‌ లను ఏర్పాటు చేయ‌డానికి సంబంధిత నియ‌మాల ను జాతీయ వైద్య సంఘం (నేశ‌న‌ల్ మెడిక‌ల్ క‌మిశ‌న్) హేతుబ‌ద్ధం చేస్తుందని, ఈ రంగం లో మాన‌వ వ‌న‌రుల ల‌భ్య‌త‌ ను, మాన‌వ వ‌న‌రుల నాణ్య‌త ను మెరుగుపరుస్తుందని, ఇదివ‌ర‌క‌టితో పోలిస్తే ఎక్కువ పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని తీసుకు వస్తుందని ఆయ‌న అన్నారు. గ‌త 6 సంవ‌త్స‌రాల లో ఎంబిబిఎస్ సీట్లు 30 వేలకు పైగా పెరిగాయ‌ని, ఇది 2014వ సంవ‌త్స‌రం తో పోల్చిన‌ప్పుడు 50 శాతానికి మించిన వృద్ధి అని ఆయ‌న చెప్పారు. పిజి సీట్ల సంఖ్య 24 వేల మేర‌కు పెరిగింద‌ని, ఇది 2014వ సంవ‌త్స‌రం నాటి నుంచి ప‌రిశీలిస్తే సుమారు 80 శాతం వృద్ధి అని ఆయ‌న వివ‌రించారు. 2014వ సంవ‌త్స‌రం లో దేశం లో ఎఐఐఎమ్ఎస్ లు 6 ఉండ‌గా, గ‌త ఆరేళ్ళ లో దేశ‌వ్యాప్తంగా మ‌రో 15 ఎఐఐఎమ్ఎస్ ల‌ను మంజూరు చేయ‌డ‌మైంద‌న్నారు.

 

ఒక్క వైద్య క‌ళాశాల అయినా లేన‌టువంటి త‌మిళ నాడు లోని జిల్లాల‌ లో కొత్త గా 11 వైద్య క‌ళాశాల ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఈ వైద్య క‌ళాశాల‌ల‌ కు భార‌త ప్ర‌భుత్వం 2,000 కోట్ల రూపాయ‌ల కు పైగా నిధుల ను ఇస్తుంద‌న్నారు. బ‌డ్జెటు లో ప్ర‌క‌టించిన ‘పిఎం ఆత్మ‌నిర్భ‌ర్ స్వ‌స్థ్ భార‌త్ యోజ‌న’ ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక, తృతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధి సామ‌ర్ధ్యాల‌ ను పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు.

 

మ‌న దేశం లో వైద్యులు అత్యంత అధిక గౌర‌వ ప్ర‌ధ‌మైన వృత్తి నిపుణుల లో ఒక‌రుగా ఉన్నార‌ని, మ‌రి ఈ గౌర‌వం మ‌హ‌మ్మారి అనంత‌ర కాలం లో ఇంకా అధికం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ గౌర‌వం ల‌భించ‌డానికి కార‌ణం ఏమిటి అంటే ఎప్పుడైతే మ‌రొక‌రి స‌మ‌స్య చావు బ్ర‌తుకుల‌ కు సంబంధించింది అవుతుందో అప్పుడు అనేక సంద‌ర్భాల లో ప్ర‌జ‌లు మీరు అనుస‌రిస్తున్న వృత్తి తాలూకు గంభీర‌త‌ ను గురించి తెలుసుకోగ‌లుగుతారు అని ఆయ‌న అన్నారు. గంభీరం గా ఉండ‌టం, గంభీరం గా ఉన్న‌ట్లు క‌నిపించ‌డం అనేవి రెండు వేరు వేరు అంశాల‌ని ఆయ‌న చెప్తూ, విద్యార్థులు వారిలోని హాస్య‌ప్రియ‌త్వాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌ల‌సింది అంటూ ఆయ‌న సూచ‌న చేశారు. ఇది వారు వారి రోగుల ను ఉల్లాసప‌ర‌చ‌డం లోను, వారి స్థైర్యాన్ని ఉన్న‌తం గా నిల‌బెట్ట‌డంలోను సాయ‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. విద్యార్థులు దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించే విధంగానే త‌మ ఆరోగ్యం పట్ల, తమ శ‌రీర దృఢత్వం ప‌ట్ల సైతం శ్రద్ధ తీసుకోవాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. విద్యార్థులు స్వార్థపరత్వం కంటే మిన్న‌ గా ఎదగాల‌ని య‌న పిలుపునిచ్చారు. అలా వారు న‌డ‌చుకొన్న‌ప్పుడు అది భ‌య‌ం అంటే ఏమిటో ఎరుగ‌కుండా వారిని దిద్దితీర్చుతుందని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi