గీతాబెన్ రబారి ఆలపించిన “శ్రీ రామ్ ఘర్ ఆయే” అనే భక్తి గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. ఈ గీతాన్ని సునీతా జోషి (పాండ్యా) రచించగా,
మౌలిక్ మెహతా సంగీతం సమకూర్చారు.
ఈ మేరకు 'ఎక్స్' ద్వారా పంపిన ఒక సందేశంలో:
“అయోధ్యలో నిర్మించిన శ్రీరామ ప్రభువు దివ్య-భవ్య మందిరంలోకి శ్రీరాముని ఆగమనం కోసం అందరి ఎదురుచూపులు ఫలించే తరుణం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా గల నా కుటుంబ సభ్యులంతా ప్రాణ ప్రతిష్ట నిర్వహించే ఆ శుభ ఘడియ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామునికి ఆహ్వానం పలుకుతూ గీతాబెన్ రబారి ఆలపించిన భక్తి గీతం అందరినీ ఆనంద డోలికలలో ఓలలాడిస్తుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
अयोध्या में प्रभु श्री राम के दिव्य-भव्य मंदिर में राम लला के आगमन का इंतजार खत्म होने वाला है। देशभर के मेरे परिवारजनों को उनकी प्राण-प्रतिष्ठा की बेसब्री से प्रतीक्षा है। उनके स्वागत में गीताबेन रबारी जी का ये भजन भावविभोर करने वाला है। #ShriRamBhajanhttps://t.co/ctWYhcPM4h
— Narendra Modi (@narendramodi) January 7, 2024