ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘గగన్‌యాన్’ సాహస యాత్ర ను గురించి నూతన సంవత్సరం లో మరియు క్రొత్త దశాబ్దం లో తన ఒకటో ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం లో ప్రస్తావించారు.
భారతదేశం 2022వ సంవత్సరం లో 75వ స్వాతంత్య్ర సంవత్సరాన్ని జరుపుకోనున్నదని ఆయన చెప్తూ, అప్పటికల్లా ‘‘ ‘గగన్‌యాన్’ మిశన్ ద్వారా భారతదేశం నుండి ఒక వ్యక్తి ని అంతరిక్షం లోకి తీసుకు పోతామని చేసిన ప్రతిజ్ఞ ను దేశం నెరవేర్చుకోవలసి ఉందన్నారు.’’
‘‘గగన్‌యాన్ మిశన్ 21వ శతాబ్దం లో విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగం లో భారతదేశాని కి ఒక చారిత్రక కార్యసిద్ధి గా నిలవబోతోంది. అది ‘న్యూ ఇండియా’కు ఒక మైలురాయి గా నిరూపితం కానుంది’’ అని ఆయన అన్నారు.
ఈ మిశన్ లో వ్యోమగాములు గా ఎంపికైన భారత వాయుసేన పైలట్ లు నలుగురిని ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, వారిని గురించి మరియు రశ్యా లో వారి శిక్షణ త్వరలో ఆరంభం కావడాన్ని గురించి తెలిపారు.
‘‘ఈ ఆశాజనక యువజనులు భారతదేశం యొక్క నైపుణ్యాని కి, ప్రతిభ కు, సామర్థ్యాని కి, సాహసాని కి మరియు స్వప్నాల కు ప్రతీకలు గా ఉన్నారు. మన ఈ నలుగురు మిత్రులు కొద్ది రోజుల లో శిక్షణ నిమిత్తం రశ్యా కు వెళ్ళబోతున్నారు. ఇది భారతదేశం-రశ్యా మైత్రి లో, భారతదేశం-రశ్యా సహకారం లో మరొక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుందన్న విశ్వాసం నా లో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక సంవత్సరాని కి పైబడి వారు శిక్షణ ను పొందిన అనంతరం దేశ ప్రజల యొక్క ఆశల ను మరియు ఆకాంక్షల ను మోసుకొంటూ నింగి కి ఎగసే బాధ్యత ను స్వీకరిస్తారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
‘‘మంగళప్రదమైనటువంటి ఈ గణతంత్ర దినం నాడు ఈ నలుగురు యువ ప్రతిభావంతుల కు, అలాగే ఈ సాహస యాత్ర తో సంబంధం గల భారతీయ మరియు రశ్యన్ శాస్త్రవేత్తల కు, ఇంజినీర్ లకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.