నేను 2019వ సంవత్సరం సెప్టెంబర్ 4వ మరియు 5 తేదీల లో రష్యా లోని వ్లాదివోస్తోక్ ను సందర్శించనున్నాను.
రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాన్ని నేను సందర్శించనుండటం, భారతదేశ ప్రధాన మంత్రి ఒకరు అక్కడ కు జరుపబోయే ప్రథమ పర్యటన ను సూచించడం తో పాటు పటిష్టమైన మన ద్వైపాక్షిక సంబంధాల ను మరింత వివిధీకరించుకోవాలన్న మరియు దృఢతరం గా మలచుకోవాలన్న ఉభయ పక్షాల అభిమతాన్ని కూడా నొక్కి వక్కాణిస్తోంది.
నా పర్యటన కు రెండు ధ్యేయాలు ఉన్నాయి. ఆ రెండు ధ్యేయాల లో ఒకటో ధ్యేయం రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షులు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఆహ్వానించిన మీదట అయిదో ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ లో ముఖ్య అతిథి గా పాలు పంచుకోవడం కాగా, రెండో ధ్యేయం ఆయన తో కలసి 20వ ఇండియా-రష్యా శిఖర సమ్మేళనాన్ని నిర్వహించడమూను. ఈ ఫోరమ్ రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతం లో వ్యాపారావకాశాల మరియు పెట్టుబడి అవకాశాల అభివృద్ధి పైన దృష్టి ని కేంద్రీకరిస్తుంది. అంతేకాక, ఈ ప్రాంతం లో రష్యా కు మరియు భారతదేశాని కి మధ్య గల సన్నిహితమైనటువంటి మరియు పరస్పరం ప్రయోజనకారి అయినటువంటి సహకారాన్ని అభివృద్ధిపరచుకోవడాని కి అపరిమిత అవకాశాల ను ప్రసాదిస్తుంది కూడాను.
మన రెండు దేశాలు మన మధ్య గల ప్రత్యేకమైనటువంటి మరియు విశేషాధికారం కలిగినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు ఒక బలమైన పునాది మీద ఆధారపడిన శ్రేష్టమైన సంబంధాల ను ఆస్వాదిస్తున్నాయి. ఇరు దేశాలు రక్షణ రంగం, శాంతియుత ప్రయోజనాల కోసం ఉద్దేశించిన పరమాణు శక్తి రంగం మరియు అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కై వినియోగించుకోవడం వంటి వ్యూహాత్మక రంగాల లో విస్తృత స్థాయి లో సహకరించుకొంటున్నాయి. మన మధ్య బలవత్తరమైన వ్యాపారం, ఇంకా పెట్టుబడి సంబంధాలు అంతకంతకు వృద్ధి చెందుతున్నాయి కూడా.
ఒక బహుళ ధృవ ప్రపంచాన్ని ప్రోత్సహించాలన్న అభిలాష తో పాటు ఈ లక్ష్య సాధన దిశ గా ప్రాంతీయ వేదికల లో, బహుళ పార్శ్విక వేదికల లో ఉభయ దేశాలు సన్నిహితం గా సహకరించుకోవాలన్న ఇచ్ఛ కూడా మన దృఢమైన భాగస్వామ్యాని కి బహుమాన పూర్వకం గా ఉంది.
మన యావత్తు ద్వైపాక్షిక సంబంధాల పై నా మిత్రుడు మరియు అధ్యక్షులు మాన్య శ్రీ పుతిన్ తో చర్చించడం తో పాటు ఉభయ పక్షాల ప్రయోజనాలు ఇమిడివున్నటువంటి ప్రాంతీయ అంశాల ను మరియు అంతర్జాతీయ అంశాల ను ప్రస్తావించడం కోసం కూడా నేను నిరీక్షిస్తున్నాను. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కు హాజరు అవుతున్న ఇతర ప్రపంచ నేతల తో భేటీ కావడం కోసం, అలాగే అందులో పాలు పంచుకోనున్న భారతదేశ పారిశ్రామిక రంగ ప్రతినిధులు, ఇంకా వ్యాపార రంగ ప్రతినిధుల తో ముఖాముఖి సంభాషించడం కోసం సైతం నేను ఎదురుచూస్తున్నాను.
The 20th India-Russia Annual Summit would also be held during the visit to Vladivostok. I look forward to holding extensive talks with President Putin, aimed at strengthening the India-Russia Special and Privileged Strategic Partnership. @KremlinRussia_E
— Narendra Modi (@narendramodi) September 3, 2019
In Russia, there would also be a visit to the Zvezda ship-building complex. It would present a great opportunity to learn about Russia’s exemplary capabilities in the ship-building sector as well as explore possibilities of cooperation in this area.
— Narendra Modi (@narendramodi) September 3, 2019
As a part of efforts to boost cultural cooperation, a special stamp to commemorate Gandhi Ji’s 150th Jayanti would be released. An innovative App to popularise Yoga would also be inaugurated. I hope more Russian sisters and brothers make Yoga an integral part of their routine.
— Narendra Modi (@narendramodi) September 3, 2019