నేను 2019వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నాటి నుండి 27వ తేదీ వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ను సందర్శించనున్నాను. నేను తొలుత హ్యూస్టన్ ను సందర్శిస్తాను. ఆ తరువాత, ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 74వ సమావేశం తాలూకు ఉన్నత స్థాయి సదస్సు లో పాలుపంచుకొనేందుకు న్యూ యార్క్ కు వెళ్తాను.
హ్యూస్టన్ లో, భారత- అమెరికా ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందింపచేసే లక్ష్యం తో యుఎస్ లోని అగ్రగామి శక్తి కంపెనీ ల సిఇఒ ల తో నేను సంభాషిస్తాను. శక్తి అనేది ఇవాళ పరస్పర లబ్ధి దిశ గా సహకరించుకోవలసిన రంగాల లో ఒక రంగం గా మారింది. అంతేకాదు, ఇది మన ద్వైపాక్షిక సంబంధాల లో ఇది ఒక ముఖ్యమైన పార్శ్వం గా కూడా రూపొందుతోంది.
హ్యూస్టన్ లో భారతీయ- అమెరికన్ సముదాయం సభ్యుల తో సమావేశమై వారిని ఉద్దేశించి ప్రసంగించేందుకు నేను కుతూహలం తో నిరీక్షిస్తున్నాను. విభిన్న రంగాల లో వారు సాధించిన విజయాలు, అనేక రంగాల లో యుఎస్ ప్రగతి కి వారు అందించిన తోడ్పాటు, స్వదేశం తో వారికి గల బలమైన అనుబంధం సహా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సచేతన సేతువు గా వారు పోషిస్తున్న అద్వితీయమైనటువంటి పాత్ర మనందరికీ గర్వకారణం. అలాగే యుఎస్ అధ్యక్షుడు ఈ సమావేశానికి నా తో కలసి ప్రప్రథమం గా హాజరై, సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రవాస భారతీయులందరికీ లభిస్తున్న గౌరవం, నేను ఎంతో సంతోషించదగ్గ అంశం కూడాను. యుఎస్ అధ్యక్షుడు నా తో పాటు భారతీయ సముదాయం సభ్యుల సమావేశం లో పాల్గొనడం ఇదే ప్రథమం. అంతేకాదు, వారికి మనం చేరువ కావడం లో ఇది ఒక మైలురాయి గా నిలచిపోతుంది.
హ్యూస్టన్ లో ఉండగా, నేను వివిధ భారతీయ- అమెరికన్ సముదాయం బృందాలతోనే కాక వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల తో కూడా సంభాషించే అవకాశం సైతం నాకు దక్కనుంది.
న్యూ యార్క్ లో, నేను ఐక్య రాజ్య సమితి తాలూకు వివిధ ప్రధాన కార్యక్రమాల లో పాల్గొంటాను. ఆనాడు 1945వ సంవత్సరం లో ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక సభ్యత్వ దేశాల లో ఒకటైన భారతదేశం బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం కోసం సదా చిత్తశుద్ధి ని ప్రదర్శించింది. ఆ మేరకు ప్రపంచం లో శాంతి భద్రతల ను ముందుకు తీసుకుపోవడానికి, విస్తృత ప్రాతిపదిక గల సార్వజనీన ఆర్థిక వృద్ధి ని, ప్రగతి ని ప్రోత్సహించడానికి తన వంతు కృషి చేసింది.
ఈ సంవత్సరం లో, ‘‘పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, జల వాయు పరివర్తన పై కార్యాచరణ, సమ్మిళితం దిశ గా బహుపాక్షిక కృషి కి ప్రేరణ’’ ఇతివృత్తం గా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 74వ సమావేశం జరుగనుంది.
అంతర్జాతీయ సమాజం ఇప్పుడు అనేక సవాళ్ల ను ఎదుర్కొంటోంది- వీటి లో నేటికీ దుర్బలంగానే ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచం లోని అనేక ప్రాంతాల లో కల్లోలం- ఉద్రిక్తత లు, ఉగ్రవాదం విజృంభణ- విస్తరణ, జల వాయు పరివర్తనతావరణ, ఎక్కడికక్కడ పేదరికం రువ్వుతున్న సవాలు అనేవి ముఖ్యమైనటువంటివి. వీటన్నిటి ని పరిష్కరించాలి అంటే బలమైన అంతర్జాతీయ వచనబద్ధత తో పాటు సంయుక్త బహుపాక్షిక కార్యాచరణ అవసరం. ఈ పథ్యం లో స్పందనాత్మక, ప్రభావ శీల, సార్వజననీత ల తో కూడిన సంస్కరణాత్మక బహుపాక్షికత కు మనం కట్టుబడి వున్నామని, తదనుగుణంగా భారతదేశం తన వంతు పాత్ర ను పోషిస్తుందని నేను పునరుద్ఘాటిస్తాను.
ఐక్య రాజ్య సమితి కార్యక్రమాల లో నేను పాలుపంచుకొని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ను సాకారం చేయడం లో మన విజయాల ను వివరిస్తాను. అలాగే అంతర్జాతీయ బాధ్యతల కు , ప్రపంచ లక్ష్యాల కు అనుగుణం గా జల వాయు పరివర్తన ను ఎదుర్కొనడంలో భారతదేశం అనుసరించిన ఉత్తేజపూరిత కార్యాచరణ ను గురించి సెప్టెంబరు 23వ తేదీ న వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సు లో ప్రముఖం గా విశదీకరిస్తాను.
సార్వత్రిక ఆరోగ్య రక్షణ పై ఐక్య రాజ్య సమితి నిర్వహించే కార్యక్రమం లో ప్రసంగించేటపుడు- ఆయుష్మాన్ భారత్ పథకం సహా భారతదేశం లో అందరికీ ఆరోగ్య రక్షణ దిశ గా ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ను, సాధించిన విజయాల ను ప్రపంచ దేశాల తో పంచుకొంటాను.
ఐక్య రాజ్య సమితి వేదిక గా మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల ను భారతదేశం నిర్వహించబోతోంది. నేటి ప్రపంచ పరిస్థితుల కు గాంధీజీ సిద్ధాంతాలు, ప్రబోధిత విలువలు ఏ విధం గా వర్తిస్తాయన్నది ఈ కార్యక్రమం బోధపరుస్తుంది. ఈ సందర్భం గా ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సహా పలు దేశాల అధినేత లు ఈ కార్యక్రమం లో గాంధీజీ కి నివాళి అర్పించి, ఆయన సందేశాని కి గల ప్రాధాన్యాన్ని చాటుతారు.
యుఎన్ జిఎ సమావేశం నేపథ్యం లో అందులోని వివిధ సంస్థ ల, ఇతర దేశాల అగ్రనాయకుల తో ద్వైపాక్షిక సంభాషణల లోనూ పాల్గొంటాను. ఇక తొలిసారి గా పసిఫిక్ ద్వీప దేశాలు, 15 కరీబియన్ దేశాల కూటమి (సిఎఆర్ఐసిఒఎమ్) నాయకుల తోనూ అధినేత ల స్థాయి సమావేశాలు నిర్వహిస్తాను. వారి తో మన ఉత్తేజపూరిత ‘‘దక్షిణ-దక్షిణ సహకారం’’, భాగస్వామ్యాన్ని ఈ సమావేశాలు మరింత ముందుకు తీసుకుపోతాయి.
కొద్ది రోజుల వ్యవధి లో ఇటు హ్యూస్టన్ లో, అటు న్యూ యార్క్ లో అమెరికా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ను కలుసుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. మన రెండు దేశాల కు, ప్రజల కు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరే దిశ గా మేము ఇరువురమూ ద్వైపాక్షిక సంబంధాల ను సమీక్షిస్తాము. విద్య, నైపుణ్యం, పరిశోధన, సాంకేతిక విజ్ఞానం, ఆవిష్కరణల లో అనేక అవకాశాల తో పాటు భారతదేశం ఆర్థిక వృద్ధి, భద్రత లు సహా మన దేశ ప్రగతి కి ఒక కీలకమైన భాగస్వామ్య దేశం గా అమెరికా ఉంది. ప్రపంచం లో పురాతనమైనటువంటి, అతి పెద్దవైనటువంటి ప్రజాస్వామ్య దేశాలు గా మన మధ్య ఉమ్మడి విలువ లు, సాదృశ ప్రయోజనాలు, పరస్పర ఆలంబన గల బలాలు మన సహజ భాగస్వామ్యాని కి పునాదులు గా నిలుస్తున్నాయి. మరింత శాంతియుతమైనటువంటి, నిలుకడతనం కలిగినటువంటి, సురక్షితమైనటువంటి, సుస్థిరమైనటువంటి, సుసంపన్నమైనటువంటి ప్రపంచం కోసం కలసి పని చేయడం ద్వారా మన వంతు పాత్ర ను పోషిద్దాము.
నా న్యూ యార్క్ పర్యటన లో అమెరికా తో మన ద్వైపాక్షిక సంబంధాల లోని ముఖ్యమైన అంశాలు కూడా భాగం అవుతాయి. అలాగే బ్లూమ్ బర్గ్ అంతర్జాతీయ వాణిజ్య వేదిక ప్రారంభ మహాసభ లో ప్రసంగించేందుకు నేను ఆసక్తి తో ఎదురుచూస్తున్నాను. ఈ సందర్భం గా భారతదేశం ఆర్థిక పురోగతి, పరివర్తనల లో మరింత చురుకు గా పాల్గొనేటట్టు అమెరికా వాణిజ్య ప్రముఖుల ను ఆహ్వానిస్తాను. ఇక గ్లోబల్ గోల్‌కీపర్స్ అవార్డ్- 2019 తో నన్ను సత్కరించాలని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేశన్ నిర్ణయించడం నాకు లభించిన గౌరవం. నా ప్రస్తుత అమెరికా సందర్శన భారతదేశాన్ని అపార అవకాశాల నెలవు గా, విశ్వసనీయ భాగస్వామి గా, ప్రపంచ ప్రగతిశీల దేశం గా నిలబెట్టడం తో పాటు అమెరికా తో మా సంబంధాల కు కొత్త శక్తి ని ఇచ్చేందుకు తోడ్పడగలదన్న విశ్వాసం నాకుంది.