గవర్నర్ ల యాభయ్యో సమావేశం ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో ముగిసింది. ఈ సమావేశం లో ఆదివాసీ సముదాయం యొక్క సంక్షేమం, జలం, వ్యవసాయం, ఉన్నత విద్య, మరియు జీవించడం లో సౌలభ్యం అంశాల పై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొన్నారు.
ఈ అంశాల పై గవర్నర్ ల తో ఏర్పాటయిన అయిదు బృందాలు వాటి నివేదికల ను సమర్పించాయి. గవర్నర్ లు సమన్వయ కర్త పాత్ర ను పోషించగలిగేటటెవంటి కొన్ని అంశాల ను గుర్తించి, వాటిపై చర్చ ను చేపట్టడమైంది. ఈ సమావేశం లో ఆదివాసీ సముదాయం యొక్క సంక్షేమం అనే అంశం పై లోతైన ఆసక్తి ని చూపించడమైంది; ఆదివాసీ ల అభ్యున్నతి కి ఉద్దేశించిన విధానాలు స్థానిక అవసరాల కు తగినట్లు గా ఉండాలని సూచించడం జరిగింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగం లో సమావేశం యాభయ్యో సంచిక విజయవంతం గా ముగిసినందుకు సభికుల కు అభినందన లు తెలియజేస్తూ, ఈ సమావేశ పరంపర సామాన్య మానవుడి అవసరాల ను తీర్చడం తోపాటు దేశ అభివృద్ధి కి కూడా పూచీ పడాలని సూచించారు.
సభికులు వారి విలువైన సలహాల ను ముందుకు తీసుకు వచ్చారని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ప్రథమ పౌరులు గా గవర్నర్ లు రాష్ట్ర స్థాయి లో చర్చల కు వీలు కల్పించాలని ప్రధాన మంత్రి అభ్యర్థించారు. అది జరిగిన నాడు, ఆయా స్థానిక పరిస్థితుల అవసరాల తో జతపడే ఆలోచనల ను పూర్తి బలం తో అనుసరించడానికి వీలవుతుందన్నారు.
ఆదివాసీ సముదాయం నివసించే ప్రాంతాల అభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, యువజన అభివృద్ధి రంగం లోను, క్రీడల రంగం లోను ప్రగతిశీల పథకాల ను అమలు చేసేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని సముచితమైన రీతి లో వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. 112 ఆకాంక్ష భరిత జిల్లాల లో అభివృద్ధి అవసరాల ను తీర్చేందుకు ఒక ఉద్యమ తరహా లో శ్రద్ధ వహించాలని, మరీ ముఖ్యం గా దేశం లోని ఆదివాసీ ప్రాంతాల పరిధి లోకి వచ్చే చోట్ల ఈ పని జరగాలని, వారు జిల్లాల అభివృద్ధి రాష్ట్ర సగటు కు మరియు దేశ సగటు కు మించి ఉండే విధం గా పూచీ పడాలని కూడా చెప్పారు.
సమావేశం లో భాగం గా జల్ జీవన్ మిశన్ పై జరిగిన చర్చ ప్రభుత్వం జల సంరక్షణ కు మరియు జల నిర్వహణ పద్ధతుల కు కట్టబెడుతున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించిందని, అంతేకాకుండా ఆయా పద్ధతుల ను స్థానిక స్థితిగతుల కు అనువుగా రూపొందించడమైందని చెప్పారు. గవర్నర్ లు విశ్వ విద్యాలయాల యొక్క కులపతుల పాత్ర లో యువత మరియు విద్యార్థి సముదాయాల నడుమ జల సంరక్షణ తాలూకు చక్కని అలవాట్ల ను పాదుకొల్పాలని ఉద్భోదించారు. ‘పుష్కరం’ వంటి జల సంబంధిత ఉత్సవాల తాలూకు సందేశాన్ని గురించి ప్రచారం చేయడం లో గవర్నర్ లు తోడ్పడాలని ప్రధాన మంత్రి మనవి చేశారు.
నూతన విద్య విధానాన్ని గురించి, ఉన్నత విద్య రంగం గురించి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు ఉన్నత నాణ్యత కలిగిన పరిశోధన పట్ల శ్రద్ధ తీసుకొనే విధం గా చూడటం లో గవర్నర్ లకు ముఖ్య పాత్ర ఉందని ప్రధాన మంత్రి చెప్తూ, అటువంటి శిక్షణ తక్కువ వ్యయం తో కూడిన నూతన ఆవిష్కరణ లకు మరియు హ్యాకథన్ ల వంటి వేదికల ను ఉపయోగించుకోగల సాంకేతికత కు దారి తీయగలుగుతుందని, తద్వారా స్టార్ట్-అప్ సంస్కృతి వర్ధిల్లేటట్లు చూడవచ్చని, ఇది యువతీ యువకుల కు ఉద్యోగావకాశాల ను సృష్టించడానికి దోహదిస్తుందన్నారు.
సామాన్య మానవుల ఈజ్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దీని కోసం ప్రభుత్వ సంస్థ లు ఒక వైపు పని లో ఆలస్యాన్ని తగ్గించేందుకు మరియు మితిమీరిన నిబంధనల కు మధ్య సమతూకాన్ని సాధించవలసిన అవసరం ఉందని, మరో వైపు ఆరోగ్య సంరక్షణ, విద్య ల వంటి మౌలిక రంగాల కు సంబంధించిన ప్రాథమిక అవసరాల ను భరించగలిగే స్థాయి లో అందుబాటు లోకి తీసుకురావడాని కి కూడాను పూచీపడాలని ఆయన సూచించారు.
వ్యవసాయ రంగాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సూక్ష్మ పరిష్కార మార్గాల ను అందించేటటువంటి క్లస్టర్ అప్రోచ్ ను వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కి వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఒక ప్రధాన పాత్ర ను పోషించగలిగే ఆచరణాత్మకమైన ప్రయోగశీల పథకాల ను పరిచయం చేయడం ద్వారా అంతర్జాతీయ స్థాయి లో వ్యవసాయ రంగం లో ఉత్తమ అభ్యాసాల ను ఆచరణ లోకి తీసుకు రావడం లో గవర్నర్ లు తోడ్పాటు ను అందించ గలుగుతారని ఆయన కోరారు.
సమావేశం ముగింపు కార్యక్రమం లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మరియు హోం మంత్రి కూడా ప్రసంగాలు చేశారు.