గౌరవనీయులైన అధ్యక్షులు బైడెన్, ప్రధానమంత్రి మొర్రిసన్, ప్రధానమంత్రి సుగా,
స్నేహితులను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది.
అధ్యక్షుడు బైడెన్ చేసిన ఈ ప్రయత్నానికి, నా కృతజ్ఞతలు.
గౌరవనీయులారా,
మన ప్రజాస్వామ్య విలువలతో, మనందరం ఐక్యంగా ఉన్నాము. ఉదారమైన, బహిరంగ, సమగ్ర ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల మనం నిబద్ధత కలిగి ఉన్నాము.
టీకాలు, వాతావరణ మార్పు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వంటి ప్రాంతాలపై దృష్టి సారిస్తూ, మన నాలుగు దేశాల బృందాన్ని ప్రపంచ మంచి కోసం ఒక శక్తిగా రూపొందించడమే - ఈ రోజు మన సమావేశంలోని ప్రధానాంశం.
ఈ సానుకూల దృక్ఫధమే, ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే "వసుధైవ కుటుంబకం" యొక్క పురాతన తత్వశాస్త్రం యొక్క కొనసాగింపుగా నేను భావిస్తున్నాను.
మన భాగస్వామ్య విలువలను పెంపొందించుకోడానికీ, సురక్షితమైన, స్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడానికీ, మనం గతంలో కంటే కలిసికట్టుగా పనిచేద్దాం.
నేటి శిఖరాగ్ర సమావేశం ద్వారా మన నాలుగు దేశాల కూటమి కి మంచి సమయం వచ్చిందని భావిస్తున్నాను.
ఇది ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి ప్రధానమైన కేంద్రంగా నిలుస్తుంది.
మీ అందరికీ ధన్యవాదములు.