యూఏఈ లో డిసెంబర్ 1న జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా మాల్దీవుల రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.
ప్రెసిడెంట్ ముయిజ్జూ పదవీ బాధ్యతలు స్వీకరించినందుకు ప్రధాని అభినందనలు తెలిపారు.
ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, అభివృద్ధి సహకారం, ఆర్థిక సంబంధాలు, వాతావరణ మార్పులు, క్రీడలతో సహా విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై చర్చించారు. ఇందుకు సంబంధించి కోర్ గ్రూప్ ఏర్పాటుకు ఈ సమావేశంలో అంగీకారం కుదిరింది.