ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74వ సమావేశం సందర్భం గా బెల్జియమ్ ప్రధాని శ్రీ చార్ల్ స్ మిశెల్ తో 2019వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు ప్రత్యేకం గా భేటీ అయ్యారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుని గా ఎన్నికైనందుకు ప్రధాని శ్రీ చార్ల్ స్ మిశెల్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
బెల్జియమ్ కు మరియు భారతదేశాని కి మధ్య నెలకొన్న శ్రేష్టమైన సంబంధాల ను నేత లు ఇరువురూ సమీక్షించారు. బెల్జియమ్ రాజు 2017వ సంవత్సరం లో భారతదేశాన్ని సందర్శించిన కాలం లో తీసుకొన్న నిర్ణయాల కు తరువాయి గా చేపట్టిన కార్యక్రమాల ను కూడా నేతలు ఇరువురూ సమీక్షించారు.
ఇయు కు మరియు భారతదేశాని కి మధ్య ఉన్నటువంటి వ్యూహాత్మక సంబంధాల ను మరియు భద్రత సంబంధాలను మరింత గాఢతరం చేసుకోవడం గురించి వారు చర్చించారు. ద్వైపాక్షిక పెట్టుబడి మరియు వ్యాపార ఒప్పందం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహయారం, బహుపాక్షిక సంస్థలు, వలస మరియు మొబిలిటీ లపై సంప్రతింపులను వీలయినంత త్వరిత గతిన ముగించే దిశ గా వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేయాలని వారు అంగీకరించారు.
ఇండియా-ఇయు 15వ సమిట్ సాధ్యపడినంత త్వరగా జరగాలి అనే విషయం లోనూ నేత లు ఇరువురూ సమ్మతి ని వ్యక్తం చేశారు.
Prime Minister @narendramodi held talks with Prime Minister @CharlesMichel of Belgium. Both leaders discussed ways to boost strategic ties and deepen cooperation in various areas including improving trade and connectivity. https://t.co/zubUlmN600 pic.twitter.com/lwDPDPK9Xq
— PMO India (@PMOIndia) September 25, 2019