హ్యూస్టన్ కు శుభోదయం,
టెక్సాస్ కు శుభోదయం,
అమెరికా కు శుభోదయం,
ప్రపంచం అంతటా ఉన్న భారతీయుల కు మరియు భారతదేశం లో ఉన్న నా సాటి భారతీయుల కు ఇవే శుభాకాంక్షలు.
మిత్రులారా,
నేటి ఉదయం ఒక ప్రత్యేక వ్యక్తి మన మధ్య కు వచ్చారు. ఆయన ను విడిగా పరిచయం చేయనక్కర లేదు. భూమి మీది ప్రతి ఒక్కరి కి ఆయన పేరు తెలిసిందే.
ప్రపంచ రాజకీయాల లో చోటు చేసుకొనే దాదాపు ప్రతి ఒక్క సంభాషణ లోనూ ఆయన పేరు ప్రస్తావన కు వస్తూవుంటుంది. ఆయన ఆడే ప్రతి మాట ను కోట్లాది ప్రజలు వింటూ వుంటారు.
ఘనమైంది అయినటువంటి ఈ దేశం లో అత్యున్నత అధికార పీఠాన్ని అలంకరించేందుకు ఆయన విజయాన్ని సాధించే కన్నా ముందు నుండే అమిత ప్రజాదరణ కు నోచుకొన్న వ్యక్తి ఆయన. ప్రతి కుటుంబాని కి ఆయన ను గురించి తెలుసును.
సిఇఒ మొదలుకొని కమాండర్- ఇన్- చీఫ్ వరకు, బోర్డ్ రూమ్ మొదలుకొని ఓవల్ ఆఫీసు వరకు, స్టూడియో లు మొదలుకొని ప్రపంచ వేదిక వరకు, రాజకీయాలు మొదలుకొని ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి చోటా ఆయన ఒక గాఢమైనటువంటి మరియు చిరకాలం నిలచివుండేటటువంటి ప్రభావాన్ని మిగిల్చారు.
ఈ రోజు న ఇక్కడ మన తో ఆయన ఉన్నారు. ఈ గొప్ప స్టేడియమ్ లోకి మరియు ఇంతటి మహా సభికుల మధ్య కు ఆయన ను స్వాగతించే విశేషాధికారం, గౌరవం నాకు లభించాయి.
మరి, ఆయన తో తరచు గా భేటీ అయ్యే అవకాశం నాకు దక్కింది అని ప్రతి సారీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ యొక్క స్నేహాన్ని, ఆప్యాయత ను, ఇంకా ఉత్సాహాన్ని నేను గమనిస్తున్నానని నేను చెప్పగలను.
ఇది అసాధారణమైంది, అపూర్వమైనటువంటిదీనూ.
మిత్రులారా,
మీకు నేను చెప్పినట్లుగా మేము ఇదివరకు కొన్నిసార్లు సమావేశమయ్యాము. ప్రతి ఒక్క పర్యాయం లో ఆయన అదే విధమైన ఆప్యాయత ను, స్నేహశీలత్వాన్ని, ఉత్సాహాన్ని, హాస్య చతురత ను కనబరచారు. దీనికంటే మిన్నగా కూడా ఆయన ను నేను అభిమానిస్తాను.
ఆయన లో నేతృత్వ స్ఫూర్తి ని, అమెరికా అంటే ఉన్నటువంటి ఉద్వేగాన్ని, ప్రతి ఒక్క అమెరికన్ గురించిన తపన ను, అమెరికా యొక్క భవిష్యత్తు పట్ల ఉన్న నమ్మకాన్ని, అంతేకాక అమెరికా ను మరోమారు గొప్ప దేశం గా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పాన్ని మనం చూడవచ్చును.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ను ఆయన ఇప్పటికే బలోపేతం చేసివేశారు. యునైటెడ్ స్టేట్స్ కోసం మరియు ప్రపంచం కోసం కూడా ఆయన సాధించింది ఎంతో ఉంది.
మిత్రులారా,
భారతదేశం లోని మేము అందరమూ అధ్యక్షుడు శ్రీ ట్రంప్ తో చక్కగా కలసిపోయాము. అభ్యర్థి శ్రీ ట్రంప్ మాటల లోనే చెప్పాలి అంటే, ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ బిగ్గర గా, స్పష్టం గా మారుమోగింది. మరి వైట్ హౌస్ లో ఆయన జరిపినటువంటి వేడుక లక్షలాది మంది వ్యక్తుల ముఖాల లో ప్రశంస ను, హర్షాన్ని ప్రతిబింబింపచేసింది.
ఆయన ను నేను తొలిసారి కలుసుకొన్నప్పుడు ఆయన నాతో ‘వైట్ హౌస్ లో భారతదేశం ఓ నిజమైన స్నేహితుడి ని కలిగివుంది’ అన్నారు. ఆ మాటల కు ఈ రోజు న మీరు ఇక్కడ కు తరలి రావడం ఒక గొప్ప నిదర్శనం గా ఉందండీ.
ఇన్ని సంవత్సరాల లో మన రెండు దేశాలు ఈ సంబంధాల ను నూతన శిఖరాల కు తీసుకు పోయాయి. మిస్టర్ ప్రెసిడెంట్, హ్యూస్టన్ లో ఈ రోజు ఉదయం ఈ గొప్ప భాగస్వామ్యం తాలూకు హృదయ స్పందన ను- ప్రపంచం లోని రెండు అతి పెద్ద ప్రజాస్వామ్యాల ఉత్సవం లో- మీరు ఆలకించవచ్చు.
మన రెండు గొప్ప దేశాల మధ్య ఉన్న మానవ సంబంధాల యొక్క శక్తి ని మరియు గాఢత ను మీరు అనుభూతించవచ్చు. హ్యూస్టన్ మొదలుకొని హైదరాబాద్ వరకు, బోస్టన్ నుండి బెంగళూరు వరకు, శికాగో నుండి శిమ్ లా వరకు, లాస్ ఏంజెలెస్ నుండి లుథియానా వరకు, న్యూ జెర్సీ నుండి న్యూ ఢిల్లీ వరకు అన్ని సంబంధాల కేంద్ర స్థానం లో ఉన్నది ప్రజలే.
ఇది ఒక ఆదివారం రాత్రి పూట పొద్దుపోయిన కాలం అయినప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తం గా లక్షలాది వ్యక్తులు వేరు వేరు కాల మండలాల లో వారి యొక్క టీవీ సెట్ లకు అంటుకుపోయి మన తో ముడిపడ్డారు. వారు చరిత్ర లిఖించబడటాన్ని వీక్షిస్తున్నారు.
మిస్టర్ ప్రెసిడెంట్, మీరు 2017వ సంవత్సరం లో మీ యొక్క కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. మరి ఈ రోజు న నా యొక్క కుటుంబాన్ని- వంద కోట్ల మంది కి పైగా భారతీయులతో పాటు భూ గ్రహం అంతటా భారతీయ వారసత్వ ప్రతినిధుల ను – మీకు పరిచయం చేసే గౌరవం నాకు దక్కింది.
మహిళలు మరియు సజ్జనులారా, మీకు నేను- నా మిత్రుడి ని, భారతదేశం యొక్క స్నేహితుడి ని, ఒక గొప్ప అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ డోనాల్డ్ ట్రంప్ ను- ఇదుగో, మీ సమక్షం లో నిలిపాను సుమా.