జర్మనీ అధ్యక్షత న జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను నేను సందర్శించనున్నాను. కిందటి నెల లో జరిగిన భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) ఫలప్రదం అయిన తరువాత, జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ను మరో మారు కలుసుకోనుండడం సంతోషదాయకం కాగలదు. మానవాళి పై ప్రభావాన్ని చూపుతున్నటువంటి ముఖ్యమైన ప్రపంచ అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరచడం కోసం ఉద్దేశించిన ప్రయాస లో భాగం గా, అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ ఆహ్వానించింది. పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి సమయోచిత అంశాల ను గురించి నేను జి7 సభ్యత్వ దేశాల తో ఆలోచనల ను వ్యక్తం చేసి ఆయా దేశాల ఆలోచనల ను తెలుసుకోబోతున్నాను. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో పాలుపంచుకొనే దేశాలు కొన్నింటి నేతల తో పాటు అతిథి దేశాల నేతల తో భేటీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను.
జర్మనీ లో ఉన్న కాలం లో, యూరోప్ అంతటా గల భారతీయ ప్రవాస సముదాయం సభ్యుల తో కూడా భేటీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆ భారతీయ ప్రవాసులు వారు నివాసం ఉంటున్న దేశాల కు ఎనలేని తోడ్పాటు ను అందిస్తూ ఉండడం తో పాటు గా యూరోప్ లోని దేశాల తో మన సంబంధాల ను కూడా సుసంపన్నం చేస్తున్నారు.
భారతదేశాని కి నేను తిరిగి వచ్చే మార్గమధ్యం లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) పూర్వ అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కన్నుమూత పట్ల నా వ్యక్తిగత సంతాపాన్ని వ్యక్తం చేయడం కోసం 2022 జూన్ 28వ తేదీ నాడు యుఇఎ అధ్యక్షుడు, అబూ ధాబీ పాలకుడైన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ను కలుసుకోవడానికని అబూ ధాబీ లో కాసేపు బస చేయనున్నాను.