శ్రేష్ఠులారా,


కోవిడ్-19 మహమ్మారి ఇది వరకు ఎరుగనటువంటి సమస్య లను సృష్టించింది. మరి, ఇది ఇంతటితోనే సమసి పోలేదు. ప్రపంచం లో చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా టీకా కు నోచుకోలేదు. ఈ కారణం గా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న ఈ కార్యక్రమం సందర్భోచితం గా ఉంది. ఇది స్వాగతించదగ్గ కార్యక్రమం.

శ్రేష్ఠులారా,

మానవాళి ని భారతదేశం ఎల్లప్పుడూ ఒక కుటుంబం గా భావిస్తూ వచ్చింది. భారతదేశ ఔషధ నిర్మాణ పరిశ్రమ తక్కువ ఖర్చు లో రోగ నిర్ధారణ పరికరాల ను, ఔషధాల ను, చికిత్స సాధనాల ను, పిపిఇ కిట్స్ ను ఉత్పత్తి చేసింది. ఇవి అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల కు ఐచ్ఛికాల ను చౌక లో సమకూర్చుతున్నాయి. మరి మేం 150కి పైగా దేశాల కు మందుల ను, ఔషధ సంబంధి సరఫరాల ను ఇచ్చాం. మా దేశం లో అభివృద్ధి పరచిన రెండు టీకా మందు లు భారతదేశం లో ‘‘అత్యవసర వినియోగాని కి అవసరమైన అనుమతి’’ని అందుకొన్నాయి. ఆ రెండు టీకాల లో ప్రపంచం లో కెల్లా ఒకటో డిఎన్ఎ-ఆధారిత వ్యాక్సీన్ కూడా ఉంది.

భారతదేశం లో అనేక కంపెనీ లు కూడా వేరు వేరు టీకా మందుల ను తగిన లైసెన్సు పొంది ఉత్పత్తి చేయడం లో తలమునకలు గా ఉన్నాయి.

ఈ సంవత్సరం మొదట్లో మేం మా టీకా లను 95 ఇతర దేశాల కు, ఐక్య రాజ్య సమితి శాంతి భద్రత దళాని కి అందించాం. సెకండ్ వేవ్ తో భారతదేశం సతమతం అయినప్పుడు ప్రపంచం కూడాను ఒక కుటుంబం మాదిరిగా భారతదేశం వెన్నంటి నిలచింది.


భారతదేశాని కి అందించిన సమర్ధన కు, సంఘీ భావానికి గాను మీకందరి కి నేను ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాను.

|



శ్రేష్ఠులారా,

ప్రపంచం లో కెల్లా అత్యంత భారీ స్థాయి లో టీకా మందు ను ఇప్పించే ఉద్యమాన్ని భారతదేశం ప్రస్తుతం నడుపుతోంది. ఇటీవలే మేం ఒక్క రోజు లో దాదాపు గా 25 మిలియన్ మంది కి టీకాల ను ఇప్పించాం. మా అట్టడుగు స్థాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఇంతవరకు 800 మిలియన్ కు పైగా వ్యాక్సీన్ డోసుల ను ఇవ్వడాన్ని పూర్తి చేసింది.

ప్రస్తుతం 200 మిలియన్ కు పైగా భారతీయుల కు టీకా సంబంధి రక్షణ కవచం లభించింది. మేం అనుసరించిన కో-విన్ (CO-WIN) అనే ఒక సరికొత్త డిజిట్ ప్లాట్ ఫార్మ్ ను ఉపయోగించినందువల్ల ఇది సాధ్యపడింది.

ఇతరుల కు సహకరించాలి అనే భావన తో, కో-విన్ ను, ఇంకా అనేక ఇతర డిజటల్ సల్యూశన్స్ ను ఓపెన్- సోర్స్ సాఫ్ట్ వేర్ కోవ లో ఉచితం గా భారతదేశం అందుబాటు లోకి తీసుకు వచ్చింది.

శ్రేష్ఠులారా,

కొత్త కొత్త భారతీయ టీకా మందు లు అభివృద్ధి చెందుతున్న క్రమం లో, మేం కూడా ప్రస్తుత వ్యాక్సీన్ ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతున్నాం.

మా ఉత్పత్తి పెరిగే కొద్దీ, టీకా మందు ను ఇతర దేశాల కు సరఫరా చేయడాన్ని మేం పునః ప్రారంభించగలుగుతాం. దీనికి గాను ముడి పదార్థాల సరఫరా వ్యవస్థ ను తెరచి ఉంచడం తప్పనిసరి.

మా క్వాడ్ భాగస్వామ్య దేశాల తో కలసి, మేం ఇండో-పసిఫిక్ రీజియన్ కోసం టీకా మందు ను ఉత్పత్తి చేసేందుకు భారతదేశ తయారీ బలాల ను ఉపయోగం లోకి తెస్తాం.

కోవిడ్ టీకాల కు, రోగ నిర్ధాణ సేవల కు మరియు మందుల కు టిఆర్ఐపిఎస్ సంబంధి మాఫీ పై దక్షిణ ఆఫ్రికా, భారతదేశం డబ్ల్యుటిఒ లో ఒక ప్రతిపాదన ను తీసుకు వచ్చాయి.

ఇదే ఆచరణ లోకి వస్తే గనుక, మహమ్మారి కి వ్యతిరేకం గా పోరాటాన్ని ముమ్మరం గా జరపవచ్చును. మనం మహమ్మారి కల్పించిన ఆర్థిక పరమైన ప్రభావాల ను పరిష్కరించడం పైన సైతం దృష్టి ని సారించవలసిన అవసరం ఉంది.

ఆ లక్ష్య సాధన దిశ లో, వ్యాక్సీన్ సర్టిఫికెట్ లకు పరస్పరం గుర్తింపు ను ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం గా మార్చాలి.

శ్రేష్ఠులారా,

ఈ శిఖర సమ్మేళనం ఉద్దేశ్యాల కు, అధ్యక్షుడు శ్రీ బైడెన్ దృష్టి కోణానికి నేను మరో సారి ఆమోదాన్ని తెలియజేస్తున్నాను.

ఈ మహమ్మారి ని పారదోలడానికి ప్రపంచం తో కలసి పని చేసేందుకు భారతదేశం సిద్ధం గా ఉంది.

మీకు ఇవే ధన్యవాదాలు.

మీకు చాలా చాలా ధన్యవాదాలు.

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India’s urban boom an oppurtunity to build sustainable cities: Former housing secretary

Media Coverage

India’s urban boom an oppurtunity to build sustainable cities: Former housing secretary
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జూలై 2025
July 13, 2025

From Spiritual Revival to Tech Independence India’s Transformation Under PM Modi