రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ క్రెమ్లిన్ లోని సెంట్ ఆండ్రూ హాల్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ ది అపోసల్’’ను ప్రదానం చేశారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందింపచేయడంలో శ్రీ నరేంద్ర మోదీ అందించిన సేవలకు గాను ఈ పురస్కారంతో ఆయనకు సత్కరించడం జరిగింది. ఈ పురస్కారాన్ని 2019లో ప్రకటించారు.
పురస్కారాన్ని ప్రధాన మంత్రి స్వీకరిస్తూ దీనిని భారతదేశ ప్రజలతో పాటు భారతదేశానికి, రష్యాకు మధ్య ఉన్న మైత్రిపూర్వకమైన సాంప్రదాయక సంబంధాలకు అంకితమిచ్చారు. ఈ గుర్తింపు ఇరు దేశాల మధ్య గల ప్రత్యేకమైన, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని చాటిచెబుతోందని కూడా ఆయన అన్నారు.
మూడు వందల సంవత్సరాల కు పూర్వం నుంచి ఈ అవార్డు ను ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ అవార్డు ను అందుకొన్న భారతదేశ తొలి నేత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.