జి-20 శిఖర సమ్మేళనానికి హాజరు కావడం కోసం బయలుదేరి వెళ్ళే ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.
“అర్జెంటీనా ఆతిథేయి గా వ్యవహరించే 13వ జి-20 శిఖర సమ్మేళానికి హాజరు కావడం కోసం 2018వ సంవత్సరం నవంబరు నెల 29వ తేదీ నుండి డిసెంబరు నెల 01వ తేదీ వరకు నేను బ్యూనోస్ ఏరీస్ ను సందర్శించబోతున్నాను.
ప్రపంచం లో అతి పెద్దవైన ఇరవై ఆర్థిక వ్యవస్థ ల నడుమ బహుళ పార్శ్వయుత సహకారాన్ని జి-20 ప్రోత్సహించగోరుతోంది. జి-20 ఆవిర్భవించిన నాటి నుండి ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలం లో ప్రపంచ వృద్ధి ని స్థిరమైన మరియు నిరంతర ప్రాతిపదిక న ప్రోత్సహించడం కోసం శ్రమిస్తూ వస్తోంది. ఈ ధ్యేయం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అలాగే ప్రపంచం లో ప్రస్తుతం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న భారతదేశం వంటి ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థల కు మరింత ముఖ్యమైంది గా ఉంది.
ప్రపంచ వృద్ధి కి మరియు సమృద్ధి కి భారతదేశం అందిస్తున్న తోడ్పాటు ‘‘న్యాయమైన మరియు నిరంతరమైన అభివృద్ధి సాధనకు గాను ఏకాభిప్రాయాన్ని నిర్మించడం’’ అనే మన వచనబద్ధత ను చాటుతోంది. ‘‘న్యాయమైన మరియు నిరంతరమైన అభివృద్ధి సాధనకు గాను ఏకాభిప్రాయాన్ని నిర్మించడం’’ శిఖర సమ్మేళనపు ఇతివృత్తం గా కూడా ఉంది.
గడచిన పది సంవత్సరాల లో జి-20 చేసిన కృషి ని సమీక్షించడానికి మరియు రానున్న దశాబ్దం లో ఎదురు కాగల కొత్త సవాళ్ళను పరిష్కరించగలిగే మార్గాలను, సాధనాలను సమకూర్చుకోవడానికి జి-20 లోని ఇతర నేతల తో భేటీ కావడం కోసం నేను వేచివున్నాను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంకా వ్యాపారం, అంతర్జాతీయ ఆర్థిక మరియు పన్నుల సంబంధిత వ్యవస్థ లు, శ్రమ యొక్క భవితవ్యం, మహిళల కు సాధికారిత కల్పన, మౌలిక సదుపాయాల తో పాటు నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి అంశాల పైన మనం చర్చోపచర్చలు చేద్దాం.
ఆర్థిక సంక్షోభం అనంతర కాలం లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ని పునరుత్తేజితం చేయడంలో ఒక ప్రధానమైన భూమిక ను పోషించిన ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థ లు ప్రస్తుతం ఇదివరకు ఎరుగని ఆర్థికపరమైన, సాంకేతిక విజ్ఞాన పరమైన సవాళ్ళ ను ఎదుర్కొంటున్నాయి. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించే మరియు ప్రపంచ హితం కోసం సమష్టి కార్యాచరణ ను తగిన విధంగా బలపరచే బహుళ పార్శ్వికత ను సంస్కరించవలసిన ఆవశ్యకత ను గురించి నేను ప్రముఖంగా ప్రస్తావించనున్నాను. అలాగే అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ట పరచవలసిన అవసరం తో పాటు ఉగ్రవాదానికి ఆర్థిక అండదండలను అందించడాన్ని వ్యతిరేకిస్తూను, పరారైన ఆర్థిక నేరగాళ్ళ కు వ్యతిరేకం గాను ఉమ్మడి కార్యాచరణ ను పెంపొందించవలసిన గంభీరమైనటువంటి అవసరం కూడా ఉంది.
పరస్పర ప్రయోజనాలు ముడిపడ్డ ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకోవడం కోసం గతం లో మాదిరి గానే, ఈ శిఖర సమ్మేళనం సందర్భంగా నేతల తో భేటీ అయ్యే అవకాశం కోసం నేను నిరీక్షిస్తాను.”