విదేశీ వ్యవహారాల శాఖ పూర్వ మంత్రి మరియు భారతదేశం లోని అత్యంత మాననీయులైన నేతల లో ఒకరు అయిన శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఒక శ్రద్ధాంజలి సభ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి ని భారతదేశాని కి తత్పరత తో సేవల ను అందించిన ఒక నేత గా ఆయన అభివర్ణిస్తూ, ఆవిడ యొక్క ప్రజా జీవనం లోని వివిధ అంశాల ను గురించి ఆయన తన ప్రసంగం లో ప్రముఖం గా ప్రస్తావించారు.
ఆమె తో కలసి పని చేసిన వారంతా శ్రీమతి స్వష్మా స్వరాజ్ గారి తో అరమరికలు లేకుండా సంభాషించే భాగ్యాని కి నోచుకొన్నారని ఆయన అన్నారు.
ఆమె అందించిన సేవల ను ప్రధాన మంత్రి గుర్తుకు తెస్తూ, మేము అందరము సుష్మా గారి తో కలసి కృషి చేయడం అనే అదృష్టాని కి నోచుకొన్నామన్నారు. ‘‘సుష్మా గారిది ఒక బహుముఖీన వ్యక్తిత్వం. మరి ఆమె తో పాటు కృషి చేసిన వారు అందరు, ఆమె ఎంతటి ఘనమైన వ్యక్తిత్వాన్ని కలిగివున్నదీ అతి సమీపం నుండి గమనించారు’’ అని కూడా ఆయన అన్నారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఒక సవాలు ను స్వీకరించడానికి ఎన్నడూ వెనుదీయలేదు
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఏదైనా సవాలు ను స్వీకరించడానికి ఎన్నడూ సంశయించ లేదు అని ప్రధాన మంత్రి అన్నారు. 1999వ సంవత్సరం లో బళ్ళారి నుండి లోక్ సభ కు పోటీ చేసే విషయం లో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ‘‘వెంకయ్య నాయుడు గారు, నేను.. మేము ఇరువురం కలసి సుష్మా గారి వద్ద కు వెళ్ళి.. మీరు ఎన్నికల లో పోరాడడం కోసం కర్నాటక కు వెళ్ళాలి అంటూ అడిగిన సంగతి నాకు జ్ఞాపకం ఉంది. ఫలితం తథ్యమే అయినప్పటి కీ ఆవిడ ఎటువంటి వారంటే సవాళ్ళ ను స్వీకరించడాని కి ఎల్లప్పుడూ సన్నద్ధురాలై ఉండేటటువంటి వారు.’’
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఒక శక్తిమంతమైనటువంటి వక్త మరియు ఆమె ఉపన్యాసాలు ప్రభావశీలం గాను, స్ఫూర్తిదాయకం గాను ఉండేవి అని ప్రధాన మంత్రి అన్నారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఎంఇఎ ను ప్రోట్ కాల్ కన్నా కూడా పీపుల్స్ కాల్ గా తీర్చిదిద్దారు
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తాను నిర్వహించినటువంటి ఏ మంత్రిత్వ శాఖ విధులకైనా అక్కడి పని సంస్కృతి లో ఒక చెప్పుకోదగినటువంటి పరివర్తన ను తీసుకు వచ్చారని కూడా ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘ఎవరైనా ఎంఇఎ ను వ్యావహారికం గా ప్రోట్ కాల్ తో ముడి పెడతారు. కానీ, సుష్మా గారు ఒక అడుగు ను ముందుకు వేసి ప్రజావాణి కి ప్రతిస్పందించి తద్వారా, ఆ మంత్రిత్వ శాఖ ను ప్రజా మైత్రీపూర్వకమైంది గా మార్చారు’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా ఉన్న కాలం లో పాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య లో గణనీయ వృద్ధి
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు గడచిన అయిదు సంవత్సరాల కాలం లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా ఉన్న కాలం లో పాస్‌పోర్ట్ కార్యాలయాల సంఖ్య ఏ విధం గా గణనీయ స్థాయి లో పెరిగిందీ ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
హరియాణ్ వీ ముద్ర
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి ని గురించి పదుగురికీ తెలియని అంశాల లో ఒక అంశాన్ని ప్రధాన మంత్రి వెల్లడి చేస్తూ, ఆమె యొక్క హరియాణ్ వీ ప్రాంతీయోచ్చారణ రీతి ని గురించి వివరించారు. ‘‘మనం రాజకీయాల పరం గా సరిఅయినటువంటి మాటల ను చెప్పే వారిని ఎరుగుదుము. అయితే, సుష్మా గారు దీనికి భిన్నమైన అటువంటి వారు. ఆవిడ తన మనస్సు కు తోచింది బయటకు చెప్పడం లో వెనుకాడే వారు కాదు; కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వారామె. ఇది ఆమె లోని ప్రత్యేకత’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ప్రధాన మంత్రి కైనా సరే ఏమి చేయాలో చెప్పగలుగుతారు
ఐక్య రాజ్య సమితి సాధారణ సభ లో ప్రధాన మంత్రి తన ఒకటో ప్రసంగాన్ని ఇవ్వడాని కన్నా ముందు జరిగిన ఒక సంఘటన ను గుర్తు కు తెచ్చుకొంటూ, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తాను ఏమి చేయాలో తన కు ఏ విధం గా మార్గదర్శనం చేసిందీ ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఐక్య రాజ్య సమితి కోసం తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవడం లో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ముందు రోజు తెల్లవార్లూ తనకు తోడ్పడిన ఘటన ను గురించి ఆయన వెల్లడి చేశారు.
బాఁసురీ లో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి జాడల ను చూశాను: ప్రధాన మంత్రి
బాఁసురీ లో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి చాయల ను తాను చూసినట్లు ప్రధాన మంత్రి చెప్తూ, ఆమె యొక్క ప్రయత్నాల పట్ల ఆమె ను మెచ్చుకొన్నారు.
కీర్తి శేషురాలైన శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి భర్త స్వరాజ్ కౌశల్ గారి కి మరియు ఆమె కుమార్తె బాఁసురీ కి ప్రధాన మంత్రి సంతాపం తెలిపారు.
ప్రార్థన సమావేశం లో పాల్గొన్న ప్రముఖుల జాబితా లో అవధేశానంద్ గిరి మహరాజ్, పూర్వ మంత్రి శ్రీ దినేశ్ త్రివేది, ఎంపి శ్రీ పినాకీ మిశ్ర, మంత్రి శ్రీ రామ్ విలాస్ పాస్ వాన్, ఎంపి శ్రీ సతీశ్ చంద్ర మిశ్ర, ఎంపి శ్రీ రాజీవ్ రంజన్, ఎంపి శ్రీ తిరుచ్చి శివ, ఎంపి శ్రీ ఎ. నవనీత కృష్ణన్, ఎంపి శ్రీ నామా నాగేశ్వర రావు, పూర్వ ఎంపి శ్రీ శరద్ యాదవ్, మంత్రి శ్రీ అరవింద్ సావంత్, ఎంపి శ్రీ ప్రేమ్ చంద్ గుప్త, ఎంపి శ్రీ సుఖ్‌బీర్ సింహ్ బాదల్, ఎంపి అనుప్రియ పటేల్, ఎంపి శ్రీ ఆనంద్ శర్మ, హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్, రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింహ్, డాక్టర్ కృష్ణ గోపాల్ మరియు శ్రీ జె.పి. నడ్డా లు ఉన్నారు.