ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సుల్తాన్ పుర్ లోధీ లో గల గురుద్వారా బేర్ సాహిబ్ లో ప్రణామమాచరించారు. ప్రధాన మంత్రి వెంట కేంద్ర ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్ గవర్నర్ శ్రీ వి.పి. సింహ్ బద్ నోర్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ శ్రీ అమరీందర్ సింహ్ బాదల్ లు ఉన్నారు.
గురుద్వారా ప్రధాన ప్రాంగణం లోపల, ప్రధాన మంత్రి ప్రార్థన లలో పాలు పంచుకొన్నారు. ఆయన కు పురోహితులు ఒక శాలువా ను ప్రదానం చేశారు. ఆ తరువాత ప్రధాన మంత్రి ప్రాంగణం అంతా కలియదిరిగారు. ఆయన గురు నానక్ దేవ్ జీ 14 సంవత్సరాల కు పైబడి ధ్యానం లో నిమగ్నమైనటువంటి రేగుపళ్ల చెట్టు ను సందర్శించారు.
ప్రధాన మంత్రి తన సందర్శన ను ముగించుకొన్న అనంతరం డేరా బాబా నానక్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన ప్యాసింజర్ టర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, కర్ తార్ పుర్ కు వెళ్లే భక్తజనం యొక్క ప్రథమ జాతా కు ప్రధాన మంత్రి యాత్రాప్రారంభ సూచక జెండా ను చూపిస్తారు.