ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు హాజరు కావడం కోసం ఈ రోజు జోధ్ పుర్ కు వచ్చారు.
జోధ్ పుర్ లో గల వైమానిక దళ స్థావరాన్ని చేరుకొని అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు.
కోణార్క్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. మాతృ భూమిని పరిరక్షించుకోవడం కోసం అంకితమై, దీక్షాబద్ధులైనటువంటి సాయుధ బలగాల ను చూసి దేశం గర్విస్తోందని ప్రధాన మంత్రి సందర్శకుల పుస్తకం లో రాశారు. అలాగే, ఆయన అంతిమ త్యాగం చేసిన మరియు తదుపరి తరాలకు ప్రేరణా మూర్తులు గా నిలచిన శూరుల ను జ్ఞప్తికి తెచ్చుకొంటూ, వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి పరాక్రమ్ పర్వ్ ను కోణార్క్ స్టేడియమ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ఆయన తిలకించారు.