ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సర్ దార్ పటేల్ జయంతి సందర్భం గా భారతదేశపు ఉక్కు మనిషి అయినటువంటి సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు గుజరాత్ లోని కేవడియా లో గల ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పుష్పాంజలి ని సమర్పించారు.
సర్ దార్ పటేల్ జయంతి ని ‘జాతీయ ఏక్ తా దివస్’గా జరుపుకొంటూ వస్తున్నాము.
‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ – ఈ లక్ష్యాన్ని సాధించాలన్న స్ఫూర్తి తో దేశం అంతటా ‘‘రన్ ఫర్ యూనిటీ’’ ని నిర్వహించడం జరుగుతోంది.
‘‘సర్ దార్ పటేల్ గారి కి ఆయన జయంతి ని పురస్కరించుకొని ఇదే నా శ్రద్ధాంజలి. మన దేశాని కి ఆయన అందించిన తోడ్పాటు సుప్రతిష్ఠితమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి కేవడియా లో జాతీయ ఏక్ తా దివస్ ప్రతిజ్ఞ యొక్క పాఠాన్ని చదివి, సభికులందరూ ఆ ప్రతిజ్ఞ ను స్వీకరించేటట్టు చూశారు.