రాష్ట్ర సేవక్ నానాజీ దేశ్‌ముఖ్ గారి జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ఘటించారు.
‘‘దేశ భక్తుడు మరియు మహా సామాజిక కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్ గారి కి ఆయన జయంతి అయిన ఈ రోజు న ఇవే నా ప్రణామాలు. రైతుల అభ్యున్నతి కోసం, పల్లెల శ్రేయం కోసం ఆయన తన సంపూర్ణ జీవనాన్ని అంకితం చేశారు. జాతి నిర్మాణాని కి ఆయన అందించినటువంటి తోడ్పాటు కలకాలం నిలచేది, దేశ వాసులకు సదా ప్రేరణ ను అందించేటటువంటిదీనూ’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
महान सामाजिक कार्यकर्ता और राष्ट्रसेवक नानाजी देशमुख को उनकी जयंती पर कोटि-कोटि नमन। उन्होंने गांवों और किसानों के कल्याण के लिए अपना संपूर्ण जीवन समर्पित कर दिया। राष्ट्रनिर्माण में उनका योगदान देशवासियों के लिए सदैव प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/k0c7Sml2Ds
— Narendra Modi (@narendramodi) October 11, 2019